రాజమౌళి సినిమా తరువాత హీరోలకు క్రేజ్ పెరగడం చూస్తూనే ఉన్నాం. ఒక పాన్ ఇండియా సినిమాలో నటించిన తరువాత రీజనల్ సినిమా ప్లాన్ చేస్తే అంతకుమించిన పొరపాటు మరొకటి ఉండదు. ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు లైన్లో పెడుతున్నాడు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ తరువాత ఎన్టీఆర్, చరణ్ లు ఎలాంటి సినిమా చేయబోతున్నారనే విషయంపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే త్రివిక్రమ్ తో తన తదుపరి సినిమాను అనౌన్స్ చేశాడు ఎన్టీఆర్.
కానీ చరణ్ మాత్రం ఇప్పటివరకు తన తదుపరి సినిమా విషయంలో సస్పెన్స్ మైంటైన్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు సైలెంట్ గా ఓ పాన్ ఇండియా సినిమాను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో ‘మళ్లీ రావా’, ‘జెర్సీ’ వంటి సినిమాలను తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి చాలా కాలంగా చరణ్ తో సినిమా చేయాలనుకుంటున్నాడు. ఇప్పటికే చరణ్ కి ఓ లైన్ కూడా వినిపించాడు. ప్రస్తుతం గౌతమ్ బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరోగా ‘జెర్సీ’ రీమేక్ చేస్తున్నాడు.
ఈ సినిమా విడుదలైతే గౌతమ్ కి బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు వస్తుందని అంచనా వేస్తున్నారు. అందుకే అతడితో సినిమా చేస్తే హిందీ మార్కెట్ లో ఇబ్బందులు ఉండవని చరణ్ భావిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ విషయంలో చరణ్ ఆసక్తి చూపిస్తున్నాడు. దాదాపు ఇదే కాంబినేషన్ లో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!