ఫొటోలు డిలీట్ చేయడం వెనుక కారణం చెప్పిన శ్రీదేవి కుమార్తె

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి సినిమాల్లోకి రాకముందే అభిమానులను సంపాదించుకుంది. కాలేజీ రోజుల్లో సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేయగానే క్షణాల్లో ఫాలోవర్స్ పెరిగిపోయారు. తన తల్లితో తీసుకున్న ఫోటోలు పెడితే విపరీతమైన లైక్లు వచ్చేవి. తన అల్లరి పనుల ఫోటోలు పెడితే స్నేహితుల నుంచి విపరీతంగా కామెంట్లు వచ్చేవి. గత మూడేళ్ళలో ఫోటోలు బాగానే పోస్ట్ చేసింది. ఫాలోవర్స్‌ పెరిగారు. అయితే జాన్వి తన అకౌంట్ ని ప్రైవేట్ లోనే ఉంచింది. ఇప్పుడు ఆమె నటిగా మారింది. మరాఠీలో బ్లాక్‌ బస్టర్ హిట్‌ అందుకున్న సైరాత్ ని హిందీలో దఢక్ గా రీమేక్ చేస్తున్నారు. శశాంక్‌ ఖైతాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా జాన్వి హీరోయిన్ గా పరిచయమవుతోంది.

షాహిద్‌ కపూర్‌ సోదరుడు ఇషాన్‌ ఖత్తర్‌ హీరోగా నటించిన సినిమా ట్రైలర్‌కు, టైటిల్‌ సాంగ్‌కు మంచి స్పందన లభించింది. జులై 20న ఈ చిత్రం రిలీజ్ కానున్న సందర్భంగా చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఇందులో భాగంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ను పబ్లిక్ చేయాల్సిన అవసరం వచ్చింది. అందులో చిలిపి పనుల ఫోటోలు, మేకప్ లేనివి ఇలా ఎన్నో నేచురల్ ఫోటోలు కూడా ఉన్నాయి. అవి ఇప్పుడు అభిమానులు చూస్తే బాగుండదని డిలీట్ చేసింది. ఈ విషయాన్ని ఓ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. “నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రైవేట్‌ ప్రొఫైల్‌ ఉండేది. ఇప్పుడు 1.9 మిలియన్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు. నా తొలి సినిమా రాబోతున్న సందర్భంగా దానిని పబ్లిక్ చేయమని చెప్పారు. దాంతో నాకిష్టమైన పాత ఫొటోలన్నీ డిలీట్‌ చేసి కొత్త పోస్ట్‌లు పెట్టాల్సి వచ్చింది.” అని జాన్వీ వివరించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus