కపూర్ కుటుంబంలోని అమ్మాయిలు నిర్వహించిన జాన్వి బర్త్ డే వేడుక!

ఆనందం పంచితే పెరుగుతుంది. దుఃఖాన్ని పంచుకుంటే తగ్గుతుంది. అందుకే కపూర్ అమ్మాయిలంతా చేరి జాన్వీ కన్నీటిని పారద్రోలారు. బాధతో వాడిపోయిన ఆమె మోహన చిరునవ్వులు పూయించారు. అతిలోకసుందరి శ్రీదేవి హఠాన్మరణం ఆ కుటుంబసభ్యులను అగాధంలోకి తోసింది. ముఖ్యంగా ఆమె కూతుళ్లు జాన్వీ, ఖుషిలకు తల్లి దూరమయ్యడం చీకటిమయం చేసింది. అందుకే జాన్వి తన పుట్టినరోజును జరుపుకోకూడదని నిర్ణయించుకుంది. వాస్తవానికి జాన్వి 21 సంవత్సరంలోకి అడుగుపెట్టనున్న సందర్భంగా తల్లి శ్రేదేవి గ్రాండ్ పార్టీ ప్లాన్ చేసింది. ఆమె తొలి సారి నటించిన ధడక్ మూవీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయాలనీ అనుకుంది.

కానీ ఆమె మరణంతో పార్టీని, రిలీజ్ ని నిలిపివేశారు. శ్రీదేవి ఎక్కడున్నా ఆమె అశీసులు జాన్వికి ఉంటాయి.. అయితే జాన్వి చీకటిలోనే ఉండిపోకూడదు.. ఆమెకి మేమున్నాము.. అంటూ కపూర్ కుటుంబానికి చెందిన అమ్మాయిలంతా కలిసి  జాన్వి  బర్త్ డే ని సర్‌ప్రైజింగ్‌గా సెలబ్రేట్ చేశారు. బోని కపూర్, అన్షులా సహా ఫ్యామిలీ అంతా కలిసి ఓ చిన్న పార్టీని అరేంజ్ చేసింది. వారంతా కలిసి బర్త్ డే నాడు జాన్వితోనే ఉన్నారు. కపూర్ ఫ్యామిలీలోని అమ్మాయిలు అంతా ఇలా ఒక్కటై సెలబ్రేట్ చేయడం ఇదే మొదటిసారి. తన అక్కచెళ్ళళ్ళు ఇచ్చిన ధైర్యంతో జాన్వి మునుపటి ఉత్సాహంతో ముందుకు సాగనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus