‘దేవర’ సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర చిత్రణ విషయంలోనే కొన్ని విమర్శలు వచ్చాయి. అవసరం లేకపోయినా స్కిన్ షో చేయించారని, అవసరం లేని మాటలు మాట్లాడించారని విమర్శలు వచ్చాయి. ఆ సినిమాకు వచ్చిన విమర్శలు జాన్వీ దగ్గరకు వెళ్లలేదో ఏమో తెలుగులో ఎంచుకున్న రెండో సినిమాలో కూడా పాత్ర చిత్రణ అలానే ఉంది. అదే ‘అచ్చియమ్మ’. లేనిపోని యాంగిల్స్‌లో లుక్స్, అవసరం లేని మాటలు సినిమాకు, ఆమెకు ఇబ్బంది పెట్టాయి.
ఈ సినిమా విషయంలో హర్ట్ అయిన జాన్వీ కపూర్ తొలుత ప్రచారానికి రాలేదని చెప్పుకొచ్చారు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమె ప్రచారానికి రావడంతో అంతా ఓకే అనుకున్నారు. అయితే సినిమా విడుదలయ్యాక ఆమె పాత్ర విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. ఏకంగా దర్శకుడు బుచ్చిబాబు సానా బయటకు వచ్చి మహిళా లోకానికి క్షమాపణలు చెప్పే పరిస్థితి వరకు వచ్చింది. ఫైనల్లీ ఆ పాత్ర గురించి జాన్వీ కపూర్ మాట్లాడింది.
‘కాఫీ విత్ కరణ్’ షోలో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘పెద్ది’ సినిమా వివాదం గురించి కరణ్ అడిగారు. దానికి జాన్వీ రియాక్ట్ అవుతూ.. ఆ సినిమా గురించి చాలా మంది కష్టపడ్డారని… అందుకోసమే ఈ విషయం గురించి మాట్లాడేందుకు సంకోచించానని చెప్పింది. సినిమాలో నా పాత్రపై నెగిటివ్ ప్రచారం మరింత బాధించింది. కొన్ని సీన్లు అభ్యంతరకరంగా ఉన్నాయి. నా పాత్ర విషయంలో జరిగిన దానికి నేను బాధ్యత తీసుకోవాల్సిందే. 100 శాతం అది నా పొరపాటే. నేను అప్రమత్తంగా ఉండాల్సింది అని చెప్పింది.
సినిమాలో కొన్ని సీన్లకు నేను గట్టిగా నో చెప్పాల్సింది. ఓ మహిళగా నాకు బాధేసింది. దీని వల్ల కలిగిన అవమాన భారాన్ని జీవితాంతం మోయక తప్పదు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా చూసుకుంటాను. డైరెక్టర్ చెప్పిన విధంగా పని చేయాలనే ఒత్తిడి నటీనటులపై ఉంటుంది. ప్రొఫెషనల్‌గా ఉండాలనే ఉద్దేశంతో డైరెక్టర్ చెప్పిందే చేశాను అని ఇన్‌డైరెక్ట్‌గా మొత్తం డైరెక్టర్ మీదకు నెట్టేసింది జాన్వీ. మరి బుచ్చిబాబు ఏమంటారో చూడాలి.