థియరీ విన్నాను.. ప్రాటికల్ గా చూస్తున్నాను – జాన్వి

ఒకరాజు తన కొడుకుకు ఎన్ని విద్యల్లో శిక్షణ ఇప్పిస్తారో.. అలాగే శ్రీదేవి తన కుమార్తె జాన్వికి సినీ రాజ్యంలో ఎలా మలచుకోవాలో ప్రతి విషయాన్ని నేర్పించారు. నటన, డాన్స్, అందం, ఫ్యాషన్.. ఇలా అన్ని విభాగాల్లో తర్ఫీదు ఇచ్చారు. అలాగే మరాఠీలో సూపర్ హిట్ సాధించిన సినిమా కథతో బాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం చేయబోతోంది. శశాంక్‌ ఖైతాన్‌ దర్శకత్వంలో ‘ధఢక్’ సినిమాని మొదలు పెట్టించింది. ఆమె చేతుల మీదుగా ఆ చిత్ర వేడుకలు జరగాలి.. కానీ ఆమె అందరిని వదిలి వెళ్లిపోయారు. అయినా జాన్వి తల్లిని తలుచుకుంటూ తొలి సినిమాని పూర్తి చేసింది. బాలీవుడ్ నటుడు షాహిద్‌ కపూర్‌ సోదరుడు ఇషాన్ నటించిన ఈ చిత్రం ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయి సంచలన వ్యూస్ అందుకుంది. ఈ చిత్రం జులై 20 న థియేటర్లో రానుండడంతో ప్రచార వేగాన్ని పెంచారు.

ఇందులో భాగంగానే మీడియా ముందుకు వచ్చిన జాన్వీ ని విలేకరులు అమ్మ నుంచి ఏమి నేర్చుకున్నారు? అని అడగగా “విమర్శల్ని ఎదుర్కోవడం నేర్పించింది” అని ఆసక్తికరంగా సమాధానమిచ్చింది. “సినిమా అంటే గ్లామర్‌, గ్లామర్‌ అంటే సినిమా.. అలాగే స్టార్‌డమ్‌ అంటే అద్దం.. దాని మీద చిన్న రాయి తగిలినా, అద్దం పగిలిపోతుంది. అందుకే, ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయం మా అమ్మ నుంచి నేర్చుకున్నా. అమ్మ నుంచి ఎన్ని నేర్చుకున్నాసరే.. సినిమా ప్రమోషన్‌కి వెళ్లిన తర్వాతే అసలు విషయం అర్థమవుతుంది. థియరీ అమ్మ దగ్గరే నేర్చుకున్నాను.. ప్రాక్టికల్‌గా తెలుసుకోబోతున్నాను” అని జాన్వీ కపూర్‌ స్పష్టం చేసింది. తల్లి అనుభవ పాఠాలు, ఆశీర్వాదాలతో జాన్వీ తప్పకుండా మంచి నటిగా పేరుతెచ్చుకుంటుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus