వర్మ పై ఒత్తిడి… జూ.ఎన్టీఆర్ కోసమేనా….?

  • March 9, 2019 / 03:05 PM IST

గతంలో జూ.ఎన్టీఆర్ ను అలాగే తన తల్లి షాలిని గారిని ఎన్టీఆర్ కుటుంబం వెలేసిన రోజుల్లో నేనే చేరదీసాను. నన్ను నానమ్మా అని పిలువు అని చెప్పేదాన్ని. అయితే ఎన్టీఆర్ కూడా ఓ అహంకారే. రామారావు గారు చనిపోయిన తరువాత కనీసం చూడటానికి కూడా వచ్చేవాడు కాదు. జూ.ఎన్టీఆర్ కూడా ఓ అహంకారే అంటూ ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి చేసిన కామెంట్స్ ఎంత సంచలనం సృష్టించాయి అందరికీ తెలిసిందే .

ఈ విషయం పక్కన పెడితే… ఇటీవల విడుదలైన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో జూ.ఎన్టీఆర్ కి సంబందించిన ప్రస్తావన తీసుకురాలేదు. దీనికి ముఖ్య కారణం ఈ చిత్రానికి వై.సి.పి పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందనే టాక్ కూడా నడుస్తుంది. ఎలాగో ఎన్టీఆర్ మామ గారైన నార్నె శ్రీనివాసరావు వై.సి.ఫై పార్టీ మెంబెరే కాబట్టి… రాంగోపాల్ వర్మతో మాట్లాడి జూ.ఎన్టీఆర్ కి సంబందించిన ఎపిసోడ్స్ లేకుండా జాగ్రత్త పడ్డారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం మార్చి 22 న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం విడుదలయ్యాక ఇంకెన్ని వివాదాలకు తెరలేపుతుందో చూడాలి..! మరో వారం రోజుల్లో సెన్సార్ కి వెళ్ళబోతున్న ఈ చిత్రానికి అసలు పరీక్ష మొదలు అవుతుంది అనే చెప్పాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus