బిగ్ బాస్4: రీ ఎంట్రీ ఉంటుందా..?

  • October 24, 2020 / 03:44 PM IST

బిగ్ బాస్ అంటేనే ఫుల్ ఆఫ్ ట్విస్ట్ లతో నిండిపోతుంది. ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది గెస్ చేయడం చాలాకష్టం. అందులోనూ ఒకసారి ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్ ని ఎప్పుడైనా బిగ్ బాస్ హౌస్ లోకి తీస్కుని రావచ్చు. ఆ అధికారం బిగ్ బాస్ టీమ్ కి ఉంటుంది. లాస్ట్ సీజన్ లో అలీరైజాని ఇలాగే రీ ఎంట్రీ ద్వారా తీస్కుని వచ్చారు. అలాగే సీజన్ 2 లో నూతన్ నాయుడు, శ్యామలా ఇలాగే రీ ఎంట్రీ ఇచ్చారు. అప్పుడు పబ్లిక్ ఓటింగ్ ద్వారా రీఎంట్రీ ఇస్తే.. అలీరైజా మాత్రం బిగ్ బాస్ టీమ్ నిర్ణయం ద్వారా తిరిగి హౌస్ లోకి వెళ్లాడు. టాప్ 5లోకి దూసుకువెళ్లాడు.

ఇక్కడే బిగ్ బాస్ ఈసీజన్ లో కూడా ట్విస్ట్ ఇవ్వబోతోందా అంటే నిజమే అంటున్నారు అందరూ. ఐదోవారం అనూహ్యంగా ఎలిమినేట్ అయిన జోర్ధార్ సుజాత మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతోందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈశనివారం నాగార్జున బిగ్ బాస్ హోస్టింగ్ చేయట్లేదు. నాగ్ ప్లేస్ లో సమంత యాంకరింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సమంత జోర్ధార్ సుజాతని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతోందని అంటున్నారు.

నిజానికి ఐదోవారం లేదా ఆరోవారం వరకూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఫెయిర్ గానే ఉంటుంది కానీ, ఇలా ఏడోవారం లేదా ఎనిమిదో వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే అది అన్ ఫెయిర్ గా ఉంటుందని అంటున్నారు బిగ్ బాస్ లవర్స్. అంతేకాదు, ఇప్పుడు సుజాత మళ్లీ రీ ఎంట్రీ ఇస్తే.., ఆ గేమ్ పూర్తిగా మారిపోతుందని బయటకి వెళ్లి తన ఎపిసోడ్స్, అలాగే హౌస్ మేట్స్ ఎపిసోడ్స్ అన్నీ చూసుకుని వచ్చిన తర్వాత తన గేమ్ ప్లాన్ పూర్తిగా మారిపోతుందని చెప్తున్నారు. మరి ఈ రీఎంట్రీ ఎప్పుడు ఎలా ఉండబోతోంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది.. అదీ మేటర్.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus