అభిమానుల కోసం…ఎంతకైనా తెగిస్తా!!!

  • June 13, 2016 / 07:07 AM IST

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మాస్ లో ఉన్న ఇమేజ్ బహుశా మరే హీరోకు లేదు అంటే అతిశయోక్తి కాదేమో. అయితే ఎన్టీఆర్ లో మాస్ కు నచ్చే అంశాలు ఏంటంటే…ఒకటి పవర్‌ఫుల్ డైలాగ్స్, రెండు సూపెర్ డ్యాన్స్. ఇంకా చెప్పాలి అంటే ఎన్టీఆర్ డైలాగ్స్ కోసం, యాక్షన్ కోసం కొందరు సినిమాలు చూస్తే..ఎన్టీఆర్ సినిమాల్లో పాటల్లో వేసే స్టెప్స్ చూసేందుకు ప్రత్యేకంగా అభిమానులు సినిమాలు చూస్తారు. అయితే ఇప్పుడు అదే ఎన్టీఆర్ లో కసి పెంచింది.

విషయం ఏమిటంటే…ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న…”జనతా గ్యారేజ్” సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో జూనియర్ సినిమాకు మరింత కష్టపడుతున్నాడట. అదే క్రమంలో గత సినిమా నాన్నకు ప్రేమతో భారీ హిట్ అయినప్పటికీ డ్యాన్స్ విషయంలో మాత్రం అభిమానులు నిరాశ పడ్డారు అని ఎన్టీఆర్ ఆలోచన పడ్డాడట. అందుకే ఆ లోటును ఈ సినిమాతో తీర్చాలనే సంకల్పంతో పనిచేస్తున్నాడు మన యువ హీరో.

సహజంగా  టాలీవుడ్ డ్యాన్సింగ్ స్టార్స్ లో టాప్ డ్యాన్సర్ అయిన ఎన్టీఆర్ సినిమాలో డ్యాన్స్ లకు ప్రత్యేకత ఉంటుంది. అందులోనూ…ఫ్లోర్ మూమెంట్స్ అయితే కేక పెట్టిస్తాయి అంటారు అభిమానులు. అయితే ఆల్రెడీ ఇమేజ్ ఉన్న హీరో ఇంత కష్టపడాలా అంటే….తన అభిమానుల కోసం కష్టపడక తప్పదు పెయిన్ కిల్లర్స్ వేసుకునైనా వారి కోసం డ్యాన్స్ వేసి వారిని మెప్పించాల్సిందే అంటాడట మన యంగ్ టైగర్. అంటే ఈ లెక్కన జనతా గ్యారేజ్ లో డ్యాన్స్ ల పంట పడినట్లే… చూద్దాం ఈ సినిమా ఎన్టీఆర్ కు ఎలాంటి ప్రత్యేకత తీసుకు వస్తుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags