Jr NTR: కాంతార ప్రీక్వెల్ ఛాన్స్ గురించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్లారిటీ ఇదే!

Advertisement

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) చేతిలో ఇప్పటికే మూడు సినిమాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. తారక్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కోసం చాలామంది దర్శకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ మధ్య కాలంలో కాంతార ప్రీక్వెల్ లో తారక్ నటిస్తున్నారంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. తారక్ ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న సంగతి తెలిసిందే. తన తల్లి పుట్టినరోజు సందర్భంగా తారక్ కుటుంబ సభ్యులతో కలిసి కర్ణాటకకు వెళ్లారు.

Jr NTR

ప్రశాంత్ నీల్ (Prashanth Neel) , రిషబ్ లతో (Rishab Shetty)  కలిసి తారక్ కర్ణాటక రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలను దర్శించుకుంటుండగా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా తారక్ కొల్లూరులో ఉన్న మూకాంబికా అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడంతో పాటు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. తారక్ తీర్థ ప్రసాదాలు స్వీకరించగా అందుకు సంబంధించిన ఫోటోలు సైతం వైరల్ అయ్యాయి.

ఆ తర్వాత తారక్ కన్నడ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రిషబ్ శెట్టితో కలిసి ఆలయాలను దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఆలయంలో సినిమా అప్ డేట్లపై స్పందించాలని లేదని దానికి వేరే కార్యక్రమాలు ఉంటాయని తారక్ బదులిచ్చారు. కాంతార ప్రీక్వెల్ లో ఛాన్స్ అంటూ వైరల్ అయిన వార్తలపై తారక్ స్పందిస్తూ రిషబ్ శెట్టి దానిని ప్లాన్ చేయాలని ఆయన ప్లాన్ చేస్తే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

రిషబ్ కోరితే కాంతార ప్రీక్వెల్ లో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తారక్ చెప్పకనే చెప్పేశారు. జూనియర్ ఎన్టీఆర్ వైపు నుంచి క్లారిటీ వచ్చిన నేపథ్యంలో రిషబ్ నిర్ణయం ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది. కాంతార ప్రీక్వెల్ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా కొరకు రిషబ్ కలరిపయట్టు అనే యుద్ధ విద్యలో కఠిన శిక్షణ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

పవన్ పై అభిమానంతో ఈ విద్యార్థులు చేసిన పని తెలిస్తే వావ్ అనాల్సిందే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news