RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీకి ఆ సినిమాలతో పోటీ తప్పదా..?

  • May 18, 2021 / 11:19 AM IST

రాజమౌళి ఏ మూహూర్తాన ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ మొదలుపెట్టారో తెలియదు కానీ గతంలో రాజమౌళి డైరెక్షన్ చేసిన ఏ సినిమాకు ఎదురు కాని ఇబ్బందులు ఈ సినిమాకు ఎదురవుతున్నాయి. బాహుబలి సిరీస్ సినిమాల షూటింగ్ ను కూడా శరవేగంగా పూర్తి చేసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో, ఆ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఆర్ఆర్ఆర్ షూటింగ్ మరోసారి వాయిదా పడటంతో వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని తారక్, చరణ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే మహేష్ బాబు సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సంక్రాంతికి రిలీజ్ కావాలని ప్లాన్ చేసుకోగా ఆర్ఆర్ఆర్ కూడా సంక్రాంతికే విడుదలైతే థియేటర్ల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు హీరోలు 2022 సంక్రాంతికే ఆర్ఆర్ఆర్ ను రిలీజ్ చేయాలని చెబుతుండటంతో జక్కన్న టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా ఇండస్ట్రీ హిట్ కావడం గ్యారంటీ అని మెగా ఫ్యాన్స్,

నందమూరి ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎన్టీఆర్, చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో స్వాతంత్ర సమరయోధులుగా కనిపించనున్నారు. ఈ సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ వెల్లడించారు. మరోవైపు ఈ సినిమాకు గ్రాఫిక్స్ కీలకం కావడంతో ఈ సినిమా ఈ ఏడాది రిలీజయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. మహేష్, పవన్ సినిమాలతో ఆర్ఆర్ఆర్ మూవీకి పోటీ తప్పేలా లేదు.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus