‘బిగ్ బాస్ 3’ కి రాజమౌళి పర్మిషన్ ఇవ్వాలిగా..?

  • January 11, 2019 / 11:37 AM IST

తెలుగులో ఈ మధ్యకాలంలో విపరీతమైన ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’. ‘స్టార్ మా’ నిర్వహిస్తున్న ఈ షో ఇప్పటికే రెండు సీజన్స్ పూర్తి చేసుకుంది. మొదటి సీజన్ ని యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ హోస్ట్ చేయగా… రెండవ సీజన్ ని నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ షో లో కంటెస్టెంట్లు గా వచ్చిన వారందరికీ మంచి గుర్తింపు దక్కడంతో పాటు.. సినిమాలలో కూడా మంచి ఆఫర్లు దక్కించుకుంటున్నారు. ఈ క్రమంలో ‘బిగ్ బాస్ సీజన్ 3’ పై ఆసక్తి నెలకొంది. అసలు ‘బిగ్ బాస్-3’ ఎవరు హోస్ట్ చేయబోతున్నారనేదానిపై అందరి దృష్టి మళ్ళింది.

గత కొంత కాలంగా ‘బిగ్ బాస్ 1’ హోస్ట్ చేసిన జూ.ఎన్టీఆర్.. ‘బిగ్ బాస్ 3’ కూడా హోస్ట్ చేయబోతున్నాడంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. జూ.ఎన్టీఆర్ , రాంచరణ్ లతో దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే.. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇక రెండవ షెడ్యూల్ జనవరి 3 వ వారంలో మొదలు కానుందని సమాచారం. రాజమౌళి చిత్ర షూటింగ్ సమయంలో హీరో బయట కమిట్మెంట్స్ కు అస్సలు పర్మిషన్ ఇవ్వడని గతంలో వార్తలు వచ్చాయి. ఒకసారి జక్కన్న సినిమా మొదలయ్యిందీ… అంటే 2 మూడు సంవత్సరాలు హీరో ని అలా కట్టిపడేస్తాడనే సంగతి తెలిసిందే. ‘బాహుబలి’ విషయంలో ప్రభాస్ కు కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ‘బాహుబలి’ చిత్రం కోసం హీరో ప్రభాస్ ను.. దాదాపు 5 ఏళ్ళు కట్టి పడేసాడు జక్కన్న.

ఇక ఈ చిత్రంలో నటించిన రానా, అనుష్క,తమన్నా, సత్య రాజ్ వంటివారు మిగిలిన సినిమాల్లో నటించుకుంటూ బాగానే సాగరు. కానీ ప్రభాస్ మాత్రం ఆ చిత్రానికి ఉండిపోవాల్సి వచ్చింది. ఇక ఈ క్రమంలో జూ.ఎన్టీఆర్ ను ‘బిగ్ బాస్ 3’ హోస్ట్ గా చేయడానికి రాజమౌళి పర్మిషన్ ఇచ్చే ప్రసక్తే లేదంటున్నారు ఫిలింనగర్ విశ్లేషకులు. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి ‘జూ.ఎన్టీఆర్’ మరో రెండు సంవత్సరాల వరకు కొనసాగక తప్పదనే చెప్పాలి. అందులోనూ జూ.ఎన్టీఆర్ కి రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేయాలనీ చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. గతంలో జూ.ఎన్టీఆర్ చిత్రాల ఆడియో ఫంక్షన్స్ కి వచ్చినప్పుడు మైక్ తీసుకుని పదే.. పదే సినిమా చేయమని అడిగేవాడు. ఇన్నాళ్ళకు ఈ అవకాశం దక్కింది కాబట్టి.. జూ.ఎన్టీఆర్… ‘బిగ్ బాస్ 3’ చేసే అవకాశం లేనట్టే కనిపిస్తుంది… మరి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus