టాలీవుడ్లో అభిమానులు ఇచ్చిన ట్యాగ్‌ను మార్చుకున్న హీరోల జాబితాలో తారక్ కూడా చేరాడు. చాలా ఏళ్లుగా తారక్‌ను అభిమానులు యంగ్ టైగర్ అని పిలుస్తూ వచ్చారు. ఆయన కూడా ఆ ట్యాగ్ విషయంలో హ్యాపీగా ఉండేవారు అంటారు. కానీ ఏమైందో ఏమో ఆయన తన ట్యాగ్ లైన్‌ను మార్చేసుకున్నారు. యంగ్, టైగర్ ఎందుకు అనుకున్నారో ఏమో ఆ రెండూ తీసేసి తనకు ఉన్న మరో ట్యాగ్ ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ను పెట్టుకున్నారు.
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవర’ సినిమాతో తారక్ కొత్త ట్యాగ్‌ను మెయిన్ చేసుకుంటున్నాడు. ఈ సినిమా నుండి ఇటీవల గ్లింప్స్‌ను విడుదల చేసింది టీమ్. అందులోనే ఈ విషయం బయటకు వచ్చింది. సినిమా టైటిల్ పడ్డప్పుడు పైన ‘మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్’ అని ట్యాగ్ వేశారు. ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. అయితే ఇప్పుడు ట్యాగ్ ఎందుకు మార్చుకున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.
‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున కూడా ఇలానే ట్యాగ్ మార్చుకున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అని చాలా ఏళ్లుగా బన్నీని పిలుచుకునేవారు అభిమానులు. అయితే ‘పుష్ప’ సమయానికి వచ్చేసరికి దానిని ఐకాన్ స్టార్ అని మార్చేశారు. ఆ మార్పు అతనికి బాగా కలిసొచ్చింది కూడా. ఇప్పుడు తారక్ కూడా అలానే ఆ సెంటిమెంట్‌తోనే మార్చుకున్నాడా అనే డౌట్‌ను వ్యక్తం చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు. మరికొందరైతే ఇంకా ‘యంగ్’ అంటే బాగోదు కాబట్టి మార్చారు అంటున్నారు.
మరి ఈ విషయంలో ‘దేవర’ టీమ్ కానీ, తారక్ (Jr NTR) టీమ్ కానీ ఏమైనా స్పష్టత ఇస్తుందేమో చూడాలి. తారక్, బన్నీనే కాదు గతంలో చాలామంది తెలుగు హీరోలు ఇలానే ట్యాగ్ మర్చుకున్నారు. గతంలో ఓసారి తారక్ కూడా ట్యాగ్ మార్చుకుని మళ్లీ వెనక్కి వచ్చాడు. ‘శక్తి’ సినిమా సమయంలో ఎన్టీఆర్ ‘ఏ1 స్టార్’ అయిన విషయం తెలిసిందే. అప్పుడు ఫలితం తేడా కొట్టేసింది. మరి ఈసారి ఏం చేస్తాడో చూడాలి.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!