Jr NTR: ఆ వెర్షన్ డబ్బింగ్ ను 4 గంటల్లో పూర్తి చేసిన తారక్.. ఏం జరిగిందంటే?

  • September 14, 2024 / 06:20 PM IST

 

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ((Jr NTR) కొరటాల శివ (Koratala Siva)  కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. దేవర (Devara) కన్నడ వెర్షన్ డబ్బింగ్ కు సంబంధించి షాకింగ్ అప్ డేట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ కన్నడ వెర్షన్ డబ్బింగ్ ను కేవలం 4 గంటల్లో పూర్తి చేశారట. ఆర్ఆర్ఆర్ (RRR) డబ్బింగ్ ను ఐదు గంటల్లో పూర్తి చేసిన తారక్ దేవర డబ్బింగ్ ను 4 గంటల్లో పూర్తి చేయడం గమనార్హం.

Jr NTR

ఒక విధంగా డబ్బింగ్ విషయంలో సైతం తారక్ తను క్రియేట్ చేసిన రికార్డులను తనే బ్రేక్ చేస్తున్నారు. దేవర మలయాళం వెర్షన్ మినహా మిగతా అన్ని భాషల్లో తారక్ ఓన్ డబ్బింగ్ చెప్పుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ దేవర కోసం పడిన కష్టం అంతాఇంతా కాదు. తారక్ కెరీర్ లో సోలో హీరోగా ఏ సినిమా కోసం ఇంతలా కష్టపడలేదు. మరోవైపు దేవరపై కొంతమంది కావాలనే విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.

ఆ ట్రోల్స్ ను అధిగమించి దేవర సక్సెస్ కావాలని కూడా అభిమానులు కోరుకుంటున్నారు. దేవర సినిమా కథ, కథనం ఊహించని విధంగా ఉండనుందని మొదట అనుకున్న ఇంటర్వెల్ ట్విస్ట్ ను ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ గా మార్చారని తెలుస్తోంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ తరహాగా తెలుగు ప్రేక్షకుల నేటివిటీకి అనుగుణంగానే ఈ సినిమా తెరకెక్కిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

దేవర సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. అర్ధరాత్రి నుంచి దేవర షోలు ప్రదర్శితం కానున్నాయంటే ఈ సినిమా రిజల్ట్ విషయంలో ఏ స్థాయిలో కాన్ఫిడెన్స్ ఉందో సులువుగానే అర్థమవుతుంది. దేవరకు కొన్ని పాజిటివ్ సెంటిమెంట్లు ఉండగా కొన్ని నెగిటివ్ సెంటిమెంట్లు ఉన్నాయి. దేవర రిజల్ట్ ఆధారంగా ఏ సెంటిమెంట్లు వర్కౌట్ అయ్యాయో క్లారిటీ రానుంది.

బెల్లంకొండ కొత్త సినిమాకు సూపర్ టైటిల్ ఫిక్స్.. టైటిల్ ఇదే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus