Jr NTR: దేవర వరకు చూసుకుంటే చాలు.. ఆ తర్వాత ఎవరూ ఆపలేరంటూ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ కు మరో బ్లాక్ బస్టర్ హిట్ దక్కుతుందని ఫీలవుతున్నారు. దేవర సినిమా షూట్ శరవేగంగా జరుగుతుండగా దేవర సినిమా వరకు చూసుకుంటే చాలని వార్2 తర్వాత తారక్ దూకుడుకు ఎవరూ బ్రేకులు వేయలేరని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. గ్లోబల్ స్టార్ గా ఎన్టీఆర్ రేంజ్ సినిమా సినిమాకు పెరుగుతుందని అభిమానులు భావిస్తున్నారు.

అయితే ఈ సినిమాలోని ఒక యాక్షన్ సీన్ కోసం కర్ణాటక రాష్ట్రం నుంచి ఇసుక, బండరాళ్లను తెప్పిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలోని కొన్ని సీన్లను సెట్స్ లోనే తీసినా ఆ ఫీల్ రాకుండా మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని బోగట్టా. ఈ సినిమాలోని సెట్స్ సహజంగా ఉండేలా జాగ్రత్త పడ్డారని సమాచారం అందుతోంది. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ లో వందల మంది ఫైటర్లు పాల్గొన్నారని తెలుస్తోంది.

దేవర సినిమాకు కొరటాల శివ దర్శకుడు కాగా కొరటాల శివకు 80 శాతం సక్సెస్ రేట్ ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా ఎన్టీఆర్ జాన్వీ జోడీకి మంచి మార్కులు పడుతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ జాన్వీ కాంబో సీన్లను మేకర్స్ తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భారీ ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో పారితోషికం అందుకుంటున్న హీరోలలో తారక్ ఒకరు కావడం గమనార్హం. కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ వేగంగా సినిమాల్లో నటిస్తే మాత్రం తారక్ దూకుడుకు ఎవరూ బ్రేకులు వెయ్యలేరని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus