రాంచరణ్- ఎన్టీఆర్ ల భారీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ 2022 జనవరి 7న విడుదల కాబోతుంది. విడుదలకి కొద్దిరోజులు మాత్రమే ఉండడంతో దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య.. ప్రమోషన్లను ఓ రేంజ్లో నిర్వహిస్తున్నారు. పాన్ వరల్డ్ చిత్రం కావడంతో పక్క రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో కూడా ‘ఆర్.ఆర్.ఆర్’ ను భారీగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రతీ ఈవెంట్లోనూ ఎన్టీఆర్, చరణ్… ఒకరి పై ఒకరు ప్రశంసలు కురిపించుకుంటూ చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు.
అయితే ఈ టీం పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ ను ఎమోషనల్ అయ్యేలా చేసాయి. అంతలా ఎన్టీఆర్ ఏం అన్నాడంటే… “17 ఏళ్ళకే హీరోగా ఎంట్రీ ఇచ్చాను. రెండో సినిమాకే నాకు స్టార్ స్టేటస్ దక్కింది. అయితే కొన్నాళ్ల తర్వాత నాకు వరుస డిజాస్టర్లు ఎదురయ్యాయి.ఆ టైములో నేను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను.అసలు ఏం చేస్తున్నానో.. ఎందుకు చేస్తున్నానో తెలియనంత అయోమయంలో ఉన్నాను. అలాంటి టైములో నాకు జక్కన్న సాయం చేశాడు.
వరుస ఫ్లాపుల్లో ఉన్న నాతో ‘యమదొంగ’ చేసి సూపర్ హిట్ ను అందించి మళ్లీ నన్ను సక్సెస్ ట్రాక్ ఎక్కించాడు. అప్పటి నుండీ మా స్నేహం మరింత బలపడింది.అప్పటి నాకు పెద్ద అండగా రాజమౌళి కనిపిస్తాడు.మధ్యలో చాలా హిట్లు వచ్చినా నేను పెద్దగా సంతృప్తి చెందలేదు.కానీ ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ లో నటించడం నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఈ చిత్రం నాకు చాలా నేర్పించింది. నటుడిగా నన్ను నేను మరింత ఇంప్రూవ్ చేసుకోవడానికి మార్గం చూపింది” అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.
Most Recommended Video
83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!