ఆ దర్శకుడు ఎన్టీఆర్ కు హ్యాట్రిక్ ఇస్తాడ?

  • February 27, 2016 / 12:24 PM IST

‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో ఒక డిఫరెంట్ లుక్ లో కనిపించి అభిమానులను అలరించిన జూనియర్ ఎన్టీఆర్ తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్న ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో కూడా మరో డిఫరెంట్ లుక్ తో అభిమానులను అలరించనున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ లుక్ కి సంబంధించి ట్రయల్స్ కూడా చేసినట్లు తెలుస్తుంది. మిర్చి, శ్రీమంతుడు చిత్రాలతో  సూపర్ హిట్లు కొట్టిన కొరటాల శివ ‘జనతా గ్యారేజ్’ లో ఎన్టీఆర్ లోని అన్ని షేడ్స్ చూపించడానికి రెడీ గా ఉన్నాడు.

మైత్రి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి చివరి వారంలో సెట్స్ పైకి  తీసుకెళ్ళనున్నారు. టెంపర్, నాన్నకు ప్రేమతో వంటి సూపర్ హిట్ల తర్వాత కొరటాల దర్శకత్వంలో నటిస్తున్న ఈ చిత్రం అటు దర్శకుడు కొరటాల మరియు హీరో ఎన్టీఆర్ కి హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తుందని చిత్ర యూనిట్,అభిమానులు భావిస్తున్నారు. మరోపక్క ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ మరియు కొరటాల ‘శ్రీమంతుడు’ చిత్రాల తర్వాత దేవిశ్రీ ప్రసాద్ ‘జనతా గ్యారేజ్’ చిత్రానికి మరోసారి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక చిత్ర యూనిట్ నుండి ఎన్టీఆర్ లుక్ డిఫరెంట్ గా ఉండబోతుందని వార్తలు వస్తుండటంతో అభిమానులు కూడా ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus