యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) , జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా నటించిన దేవర (Devara) మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి మరో మూడు వారాల సమయం మాత్రమే ఉంది. మరికొన్ని గంటల్లో ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ దావుడి రిలీజ్ కానుంది. ఈ సాంగ్ మాస్ సాంగ్ అని తారక్ ఫ్యాన్స్ ఎలాంటి సాంగ్ కోరుకుంటున్నారో అదే విధంగా ఈ సాంగ్ ఉండనుందని తెలుస్తోంది. ఈ నెల రెండో వారం నుంచి దేవర ప్రమోషన్స్ మొదలుకానున్నాయి.
అయితే తెలంగాణలో దేవరకు ఎలాంటి సమస్య లేదు కానీ ఏపీలో ఈ సినిమాకు టికెట్ రేట్ల పెంపు ఉంటుందా? ఉండదా? అనే చర్చ జరుగుతోంది. బాలయ్య (Balakrishna) స్వర్ణోత్సవ సంబరాల వేడుకలకు తారక్ హాజరు కాలేదనే సంగతి తెలిసిందే. అయితే 15 సంవత్సరాల క్రితం టీడీపీ తరపున ప్రచారం చేసిన తారక్ ప్రస్తుతం టీడీపీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు. అందువల్ల ఏపీ ప్రభుత్వం దేవర టికెట్ రేట్ల విషయంలో ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.
ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం ఏపీలో సైతం దేవరకు టికెట్ రేట్ల పెంపు ఉంటుందని అయితే ఆ పెంపు మరీ భారీగా ఉండదని వినిపిస్తోంది. దేవర సినిమాకు టికెట్ రేట్ల పెంపు విషయంలో ఎలాంటి అన్యాయం జరగకుండా పవన్ (Pawan Kalyan) చూసుకునే ఛాన్స్ ఉందనే ప్రచారం సైతం జరుగుతోంది. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలకు తారక్ కోటి రూపాయల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.
తారక్ ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో మంచి మనస్సును చాటుకున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దేవర విషయంలో ఎలా వ్యవహరిస్తాయో చూడాల్సి ఉంది. తారక్ విరాళం ప్రకటించడంతో మరి కొందరు స్టార్ హీరోలు సైతం విరాళం ప్రకటించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్టీఆర్ దేవర (Devara) మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.