పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ని వెంకటేష్ (Venkatesh)..లానే రీమేక్ రాజా అంటుంటారు. ఎందుకంటే కెరీర్లో ఎక్కువగా రీమేక్ సినిమాల్లోనే నటించారు పవన్ కళ్యాణ్. ఓ మంచి కథ ఏ భాషలో రూపొందినా… దాన్ని తెలుగు ప్రేక్షకులకు కూడా అందించాలి అనేది ఆయన ముఖ్య ఉద్దేశం. అందుకే మనకు ‘ఖుషి’ (Kushi) ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. అంతేకాదు పవన్ నటించిన మరికొన్ని రీమేక్..లు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇంకొన్ని ఫ్లాప్ అయ్యాయి. ఇంకొన్ని అయితే అసలు సెట్స్ పైకే వెళ్ళలేదు. అలా పవన్ మిస్ చేసుకున్న కొన్ని రీమేక్..లను ఇప్పుడు ఓ లుక్కేద్దాం రండి :
1) నీరం : మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘నీరం’ అనే చిత్రాన్ని ‘శ్రీ సూర్య మూవీస్’ బ్యానర్ పై ‘చెప్పాలని ఉంది’ పేరుతో రీమేక్ చేయాలని అనుకున్నారు. కానీ ఎందుకో అది మధ్యలో ఆగిపోయింది. తర్వాత అదే కథని రామోజీరావు (Ramoji Rao) నిర్మాణంలో కె.విజయ భాస్కర్ (K. Vijaya Bhaskar) దర్శకత్వంలో ‘నువ్వే కావాలి’ పేరుతో రీమేక్ అయ్యి సంచలన విజయాన్ని నమోదు చేసింది.
2) అప్పు : కన్నడలో పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) హీరోగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని పవన్ తో రీమేక్ చేయాలని అనుకున్నారు దర్శకులు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) . కానీ పవన్ నో చెప్పడంతో ‘ఇడియట్’ (Idiot) గా రవితేజతో (Ravi Teja) రీమేక్ చేయడం జరిగింది. ఇది కూడా సూపర్ హిట్ అయ్యింది. ‘అప్పు’ కి కూడా పూరి జగన్నాథే దర్శకుడు కావడం విశేషం.
3) సేతు : తమిళంలో విక్రమ్ (Vikram) హీరోగా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో పవన్ రీమేక్ చేయాలనుకున్నారు. కానీ రీమేక్ రైట్స్ ను ముందుగా జీవితా రాజశేఖర్ (Rajasekhar) ..లు కొనుగోలు చేయడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. తర్వాత ‘శేషు’ పేరుతో రీమేక్ అయిన ఈ సినిమా ప్లాప్ గా మిగిలింది.
4) గజిని : ఈ సినిమా రీమేక్ రైట్స్ ను ‘గీతా ఆర్ట్స్’ సంస్థ కొనుగోలు చేసి పవన్ తో రీమేక్ చేయాలి అనుకుంది. కానీ తన ఇమేజ్ కి ఇది మ్యాచ్ అవ్వదని భావించి పవన్ నో చెప్పారు.
5) కత్తి (Kaththi) : ‘శ్రీ సూర్య మూవీస్’ సంస్థ ఇదే చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేయాలి అనుకుంది. అందుకే తెలుగు వెర్షన్ ను మొదట రిలీజ్ చేయలేదు. కానీ తర్వాత పవన్ ప్లాన్స్ మారడంతో, దీన్ని పక్కన పెట్టారు. తర్వాత చిరంజీవి (Chiranjeevi) – వినాయక్ (V. V. Vinayak) కాంబినేషన్లో ‘ఖైదీ నెంబర్ 150’ గా (Khaidi No. 150) ఇది రీమేక్ అయ్యింది.
6) దబాంగ్ 2 : ‘దబాంగ్’ రీమేక్ గా ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) రూపొంది బ్లాక్ బస్టర్ అయ్యింది. తర్వాత ‘దబాంగ్ 2’ ని పవన్ తో రీమేక్ చేయాలని కొందరు నిర్మాతలు భావించారు. కానీ పవన్ ఇంట్రెస్ట్ చూపించలేదు. తర్వాత తన సొంత కథతో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ (Sardaar Gabbar Singh) ని రూపొందించారు పవన్. అది డిజాస్టర్ అయ్యింది.
7) విక్రమ్ వేద (Vikram Vedha) : తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో కొంతమంది హీరోలతో రీమేక్ చేయాలని చాలా మంది నిర్మాతలు ప్రయత్నించారు. ఓ దశలో పవన్, రవితేజ..లతో ఫిక్స్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. పవన్ అయితే ఈ రీమేక్ కి నో చెప్పారు.
8) డ్రైవింగ్ లైసెన్స్ : మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) పాత్రకి పవన్ ను అనుకున్నారు. కానీ ఎందుకో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు.
9) ఎన్నై అరిందాల్ (Yennai Arindhaal) : గౌతమ్ మీనన్ (Gautham Vasudev Menon) డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ‘ఎంతవాడుగాని’ పేరుతో డబ్ అయ్యింది. అయినప్పటికీ చిరు, పవన్ ఇద్దరూ ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తే బాగుంటుంది అనుకున్నారు. పవన్ కోసం కొంతమంది దర్శకులతో ఈ రీమేక్ స్క్రిప్ట్ డెవలప్ చేయించారు. కానీ స్క్రిప్ట్ వర్కౌట్ కాలేదు.
10) ఓ మై గాడ్ 2 (Oh My God2) : బాలీవుడ్లో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేయాలని కొందరు దర్శక నిర్మాతలు ప్రయత్నించారు. కానీ పవన్ బిజీ షెడ్యూల్ కి సెట్ అవ్వలేదు.
11) వేదాళం (Vedalam) : తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని కూడా పవన్ తో రీమేక్ చేయాలని నిర్మాత ఏ.ఎం.రత్నం (A. M. Rathnam) ప్రయత్నించారు. కానీ ఎందుకో ఇది కూడా సెట్స్ పైకి వెళ్ళలేదు. తర్వాత ‘భోళా శంకర్’ (Bhola Shankar) గా చిరు రీమేక్ చేయడం జరిగింది. గత ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది.
బర్త్ డే స్పెషల్: నటన కాకుండా పవన్ కల్యాణ్ ఏమేం చేశాడో తెలుసా? లిస్ట్ ఇదిగో..!