Jr NTR: కాంతార2 సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తారా.. ఏమైందంటే?

  • March 9, 2024 / 02:45 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కెరీర్ ప్లానింగ్స్ ప్రస్తుతం వేరే లెవెల్ లో ఉన్నాయి. వరుసగా సినిమాలలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కథ అద్భుతంగా ఉంటే గెస్ట్ రోల్స్ లో నటించడానికి సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. వార్2 సినిమాలో తారక్ అరగంట నిడివి ఉన్న పాత్రలో ఏజెంట్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్, రిషబ్ శెట్టి (Rishab Shetty) తాజాగా కలిసిన నేపథ్యంలో ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాంతార2 లో తారక్ గెస్ట్ రోల్ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. కాంతార2 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అతిథి పాత్రలో నటించినా ఈ సినిమాపై అంచనాలు మరింత మరింత పెరిగే అవకాశాలూ అయితే ఉంటాయి. కాంతార2 సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో, ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతుండటం గమనార్హం. కాంతార 16 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కి 400 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంది.

కాంతార2 సినిమా కోసం నిర్మాతలు భారీ బడ్జెట్ ను కేటాయించారని సమాచారం అందుతోంది. కాంతార2 మూవీ రిలీజ్ డేట్ గురించి స్పష్టత రావాల్సి ఉంది. ఏదైనా పండుగ సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేస్తే బాగుంటుందని ఈ సినిమా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాంతార2 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారో లేదో అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

కాంతార2 సినిమాలో ఆసక్తికర ట్విస్టులు ఉంటాయని తెలుస్తోంది. రిషబ్ శెట్టి ఈ సినిమాతో కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాంతార2 పాటల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందిస్తే తన సినిమాలకు సంబంధించిన కన్ఫ్యూజన్ దూరమవుతుందని చెప్పవచ్చు.

గామి సినిమా రివ్యూ & రేటింగ్!

భీమా సినిమా రివ్యూ & రేటింగ్!
వళరి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus