Jr NTR: అన్న కోసం ఆ పని చేస్తున్న యంగ్ టైగర్..?

Advertisement

ఒకవైపు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా బంధాలు, అనుబంధాలకు ప్రాధాన్యత ఇచ్చే హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే. వరుస విజయాలను అందుకుంటున్న ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ కూడా కెరీర్ పరంగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు. ఒకవైపు తన తరువాత సినిమాలలో కళ్యాణ్ రామ్ కు నిర్మాతగా అవకాశం కల్పిస్తున్న ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నటిస్తున్న బింబిసార సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే రిలీజైన బింబిసార ఫస్ట్ లుక్ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. బింబిసార సినిమాతో కళ్యాణ్ రామ్ ఇతర భాషల్లో సైతం గుర్తింపు సంపాదించుకోవాలని అనుకుంటున్నారు. పటాస్ సినిమా తర్వాత ఆ స్థాయి హిట్ సాధించని కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించాలని భావిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుండటం గమనార్హం.

టైమ్ ట్రావెల్ కు సంబంధించిన కథతో ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాలో పౌరాణిక అంశాలకు కూడా ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. వశిష్ట అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తే సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సినిమా దర్శకుడు వశిష్ట , హీరో కళ్యాణ్ రామ్ సైతం గంభీరంగా ఉండే ఎన్టీఆర్ గొంతు సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus