Jr NTR: రెడ్ కార్పెట్ పై నడిచేది మేము కాదు… చాలా గర్వంగా ఉంది: ఎన్టీఆర్

  • March 10, 2023 / 08:46 PM IST

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించినటువంటి చిత్రం RRR. ఈ సినిమా విడుదల అయ్యి ఏడాది కావస్తున్న ఇప్పటికి ఈ సినిమా హవా ఏ మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇలా ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో మంచి ఆదరణ రావడంతో ఏకంగా ఆస్కార్ అవార్డు నామినేషన్ లో నిలబడి గట్టి పోటీ ఇస్తుంది.

ఇలా ఈ సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో ఉండడంతో చిత్ర బృందం పెద్ద ఎత్తున అమెరికాలో సందడి చేస్తూ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇప్పటికే ఎన్టీఆర్ రామ్ చరణ్ ఎన్నో కార్యక్రమాలలో పాల్గొనగా తాజాగా ఎన్టీఆర్ Et The Oscars ఇంటర్వ్యూలో పాల్గొన్నారు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ ఆస్కార్ రోజున రెడ్ కార్పెట్ పై నడిచేది నటులుగా మేము కాదని యావత్ భారతదేశాన్ని మా గుండెల్లో పెట్టుకొని నడుస్తామని ఎన్టీఆర్ తెలియజేశారు.

తమకు ఇంత మంచి అదృష్టం రావడానికి గర్వంగా ఫీల్ అవుతున్నామని ఎన్టీఆర్ తెలిపారు. ఇక నామినేషన్స్ లో నిలిచినటువంటి నాటు నాటు పాట చేయడానికి పడిన కష్టాన్ని కూడా ఈయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సినిమాలోని ఈ పాట షూటింగ్ కు వారం రోజుల ముందు నుంచి రిహార్సల్స్ చేయడం ప్రారంభించామని తెలిపారు. ఈ పాటకు డాన్స్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని షూటింగ్ చేస్తున్న సమయంలో కూడా రిహార్సల్స్ చేస్తూ ఈ పాట కోసం ఎంతో కష్టపడ్డామని ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇలా ఈ పాట కోసం ఎంతో కష్టపడటంతోనే ఈ పాట అందుకు తగ్గ గుర్తింపు సంపాదించుకుంది. అయితే 12వ తేదీ తప్పనిసరిగా చిత్ర బృందం ఆస్కార్ చేత పట్టుకొని స్వదేశానికి రావాలని ఎంతోమంది భారతీయులు ఆకాంక్షిస్తున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus