ఎన్టీఆర్ ధరించిన మాస్క్.. కాస్ట్ వైరల్

  • February 27, 2021 / 04:42 PM IST

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎలాంటి వస్తువులు వాడినా కూడా ఈ మధ్య బాగానే వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆయన ఫ్యాషన్ గురించి అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. క్యాప్ నుంచి షూస్ వరకు ఏది వాడినా కూడా వాటి ధర ఎంతో తెలుసుకోవడానికి అభిమానులు బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఎవరు ఉహీంచని విధంగా ఇప్పుడు ఎన్టీఆర్ ధరించిన మాస్క్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాని ధర కూడా ఎంత ఉంటుందో అనేలా కామెంట్స్ వస్తున్నాయి.

ఇటీవల సుకుమార్ కూతురు ట్రెడిషినల్ ఫంక్షన్ కు వెళ్లిన తారక్ ఈ బ్రాండెడ్ మాస్క్ తో కనిపించాడు. ప్రముఖ యూఎస్‌ స్పోర్ట్స్ కంపెనీకి చెందిన ఈ మాస్క్‌ ధర 2340 రూపాయలు. ఒక విధంగా ఆ కంపెనీకి ఎన్టీఆర్ వలన ఫ్రీగా ప్రమోషన్ వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే తారక్ ఫొటో సోషల్ మీడియాలో కనిపిస్తే కామెంట్స్ బాక్స్ లో ఈ మాస్క్ కు సంబంధించిన లింక్స్ ల్ ను అభిమానులు ఫ్రీగా ప్రమోట్ చేస్తూ కొనేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

1

2

3

Most Recommended Video

చెక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అక్షర సినిమా రివ్యూ & రేటింగ్!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus