Jr NTR: ఎన్టీఆర్30 మూవీకి డ్యూయల్ రోల్ ప్లస్ అవుతుందా?

ఎన్టీఆర్30 సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా ఆ అప్ డేట్ తక్కువ సమయంలోనే తెగ వైరల్ అవుతోంది. ఎన్టీఆర్30 సినిమాలో తారక్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారని క్రేజీ అప్ డేట్ వచ్చింది. అయితే తారక్ తండ్రీకొడుకులుగా కనిపించనున్నారని సమాచారం అందుతోంది. తారక్ తండ్రీకొడుకుల రోల్స్ లో నటించడం అభిమానులకు ఏ మాత్రం ఇష్టం లేదని బోగట్టా. ఆంధ్రావాలా, శక్తి సినిమాలలో తారక్ డ్యూయల్ రోల్ లో తండ్రీ కొడుకులుగా కనిపించి మెప్పించారు.

అయితే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ ను అయితే సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్30 సినిమాకు డ్యూయల్ రోల్ ప్లస్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. కొన్నిరోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ మొదలు కాగా ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తైందని తెలుస్తోంది.

(Jr NTR) తారక్, కొరటాల శివ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఈ సినిమా స్పెషల్ మూవీగా నిలుస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కోసం తారక్ ఫ్యాన్స్ మాత్రం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2024 సంవత్సరం ఏప్రిల్ నెల 5వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

రిలీజ్ కు ఏడాది సమయం ఉండగానే బిజినెస్, ఇతర విషయాలకు సంబంధించి తారక్30 వార్తల్లో నిలుస్తోంది. ఎన్టీఆర్30 స్పెషల్ గా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తారక్ మరిన్ని విజయాలను అందుకుని రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా తప్పటడుగులు పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus