యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబో మూవీ అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కనుండగా ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు 350 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని నిర్మాతలకు సమాచారం ఇచ్చారట. ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో పోల్చి చూస్తే ఈ సినిమాకు 80 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు కానుందని సమాచారం అందుతోంది.
ఈ సినిమా సలార్ ను (Salaar) మించిన సినిమా అవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దాదాపుగా 7 నెలల పాటు ఈ సినిమా స్క్రిప్ట్ పై ప్రశాంత్ నీల్ వర్క్ చేశారని సమాచారం. ప్రశాంత్ నీల్ చెప్పిన కథ జూనియర్ ఎన్టీఆర్ కు సైతం ఎంతగానో నచ్చిందని తెలుస్తోంది. సోలో హీరోగా తారక్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ హిట్ గా నిలవనుందో చూడాల్సి ఉంది. ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది.
రష్మిక మరి కొందరు హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నా ఈ సినిమాలో ఎవరు ఫైనల్ అవుతారనే ప్రశ్నలకు సంబంధించి జవాబులు దొరకాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ చాలా సంవత్సరాల క్రితమే ఈ సినిమా స్టోరీ లైన్ ను సిద్ధం చేసుకున్నా బడ్జెట్ పరిమితుల వల్ల ఆగారని భోగట్టా. ఈ సినిమాకు సంబంధించి విదేశాల్లో ఎక్కువ సన్నివేశాలు షూట్ చేస్తారని తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ 2026 సంక్రాంతికి బాక్సాఫీస్ ను షేక్ చేసే బ్లాక్ బస్టర్ హిట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తారేమో చూడాల్సి ఉంది.