యంగ్ టైగర్ ఎన్టీఆర్…ఈ పేరు వింటే మాస్ అభిమానులు అభిమానంతో ఉప్పొంగిపోతారు…ఇక నందమూరి అభిమానులైతే జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తూ తమ ఘర్జన శబ్ధం వినిపిస్తారు…అయితే యువ హీరోల్లో అన్ని కోణాల్లోనూ తిరుగులేని నటుల్లో అతి కొద్ది మందిలో ఎన్టీఆర్ ఒకరు…చిన్న తనంలోనే బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి టాలీవుడ్ రికార్డులను మడత పెట్టేసీన ఎన్టీఆర్…ఇప్పుడు ఎన్టీఆర్ ఆర్ట్స్ లో అన్న కల్యాణ్ రామ్ నిర్మాణంలో జై లవకుశ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే…అయితే అదే క్రమంలో ఈ సినిమాలో మూడు పాత్రలు ఉండడంతో ఆ మూడు పాత్రలకు న్యాయం చేసే విధంగా తనదైన శైలిలో బిజీగా గడుపుతున్నాడు…అయితే తాను నటిస్తున్న మూడు పాత్రల పై సీరియస్ గా దృష్టి పెట్టిన ఎన్టీఆర్ ను ఈసినిమా షూటింగ్ స్పాట్ లో కొంతమంది అభిమానులు కలసి….అతడి పై వస్తున్న రకరకాల రూమర్ల విషయం ప్రస్తావించినట్లు టాక్. అంతేకాకుండా….ముఖ్యంగా గత కొద్దిరోజులుగా కొన్ని మీడియా వర్గాలలో జూనియర్ పేరును లింక్ చేసి వస్తున్న ‘నవభారత్ నేషనల్ పార్టీ’ విషయాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
ఇక ఈవిషయాలు తన అభిమానుల నోటివెంట విన్న వెంటనే జూనియర్ దీనిపై సీరియస్ అవకుండా….చిరునవ్వుతో సమాధానం ఇస్తూ తాను, ఇలానాటి వార్తలకు నమ్మాల్సిన పని లేదు…ఇటువంటి వార్తలను నేను పట్టించుకోనని తన అభిమానులు కూడా ఇటువంటి వార్తలను లెక్క చేయవద్దు అని తెలిపినట్లు సమాచారం….అంతేకాకుండా…. ప్రస్తుతం తన దృష్టి అంతా కరియర్ పైనే ఉందని తాను నటించవలసిన సినిమా ప్రాజెక్ట్స్ వరస పెట్టి క్యూలో ఉన్న నేపధ్యంలో మరో మూడు సంవత్సరాల వరకు తనకు వేరే విషయాలు ఆలోచించే తీరికలేదు అని జూనియర్ తేల్చి చెప్పేసినట్లు టాక్…ఇక తాను రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశ్యం ఉంటే తాను బహిరంగంగా ప్రకటన చేసి వస్తాను కానీ తాను ఇలా రహస్యంగా వేరే పార్టీని ఆధారంగా చేసుకుని రాజకీయాలలోకి రావలసిన అవసరం తనకు లేదు అని కామెంట్స్ చేసినట్లు జూనియర్ అభిమానుల ద్వారా అందుతున్న సమాచారం…అంటే మొత్తంగా ఏ రూమర్స్ పై ఒక క్లారిటీ వచ్చినట్లే అన్న మాట…
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.