Jr NTR: తారక్ షాకింగ్ ట్వీట్.. బాల బాబాయ్ అంటూ..?

  • June 10, 2021 / 12:49 PM IST

నేడు నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టినరోజనే సంగతి తెలిసిందే. బాలయ్య బర్త్ డే సందర్భంగా సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ బాలయ్యపై ఉన్న ప్రేమను చూపిస్తూ ట్వీట్ చేశారు. జన్మదిన శుభాకాంక్షలు బాల బాబాయ్ అంటూ ఎన్టీఆర్ చెప్పిన బర్త్ డే విషెస్ ను కూసి నందమూరి అభిమానులు సంతోషిస్తున్నారు.

ఎన్టీఆర్ తన ట్వీట్ లో బాలకృష్ణ అన్నివేళలా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. బాబాయ్ బాలయ్య, అబ్బాయ్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఉందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుండగా ఎన్టీఆర్ తన ట్వీట్ తో ఆ ప్రచారానికి చెక్ పెట్టారు. బాల బాబాయ్ అంటూ సరికొత్త పిలుపుతో ఎన్టీఆర్ అభిమానులు సైతం షాకయ్యేలా ట్వీట్ చేయడం గమనార్హం. కళ్యాణ్ రామ్ కూడా సోషల్ మీడియా వేదికగా బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. నారా బ్రాహ్మణి తండ్రి బాలయ్యకు పుట్టినరోజుకు శుభాకాంక్షలు చెబుతూ పవర్ హౌస్ అంటూ బాలయ్యను తెగ పొగిడేశారు.

మెగాస్టార్ చిరంజీవి మిత్రుడు బాలయ్య అని సంభోదిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు బాలయ్య సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. మరోవైపు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా అఖండ సినిమా నుంచి పోస్టర్ రిలీజ్ కాగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కనున్నట్టు పోస్టర్ తో కన్ఫామ్ అయింది.


Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus