Jr NTR: దేవర బాధ్యత మొత్తం ఎన్టీఆర్ తీసుకున్నారా?

  • August 8, 2023 / 10:11 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్నటువంటి దేవర సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా దేవర సినిమా షూటింగ్లో భాగంగా ఈయన ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఆచార్య వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్నటువంటి ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకొని కొరటాలపై ఉన్న డిజాస్టర్ మార్కు తుడిచేయాలని భావిస్తున్నారట.

ఈ క్రమంలోనే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకున్న తర్వాతనే షూటింగ్ మొదలు పెట్టారని తెలుస్తుంది అదే విధంగా ప్రతి షార్ట్ పూర్తి అయిన తర్వాత దానిని ఎన్టీఆర్ చూసి ఆయన ఫైనల్ చేస్తున్నారట ఇలా ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్లోని ప్రతి ఒక్క అంశంపై ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఆచార్య విషయంలో జరిగినట్టు దేవర విషయంలో జరగకుండా ఉండడం కోసమే ఎన్టీఆర్ (Jr NTR) ఈ సినిమాపై స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేశారని సమాచారం.

ప్రస్తుత ఈ సినిమా హైదరాబాదులోని భారీ సెట్ నిర్మించి భారీ యాక్షన్ సన్ని వేషాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తుంది. ఇక రాజమౌళి సినిమా తర్వాత చేసే తదుపరి సినిమా డిజాస్టర్ అవుతుందన్న సెంటిమెంట్ కూడా ఇండస్ట్రీలో కొనసాగుతుంది అయితే ఆ సెంటిమెంట్ బ్రేక్ చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ ఆచార్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచిపోయి మరోసారి రాజమౌళి సెంటిమెంట్ నిజమేనని నిరూపించింది. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అయితే ఈ సినిమా హిట్ అందుకొని అటు కొరటాలపై ఉన్న డిజాస్టర్ రాజమౌళి సెంటిమెంట్ రెండింటిని బ్రేక్ చేయాలన్న దిశగా ఎన్టీఆర్ ఈ సినిమా కోసం కష్టపడటం వల్లే ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus