Jr NTR: సోలో హీరోగా తారక్ బాలీవుడ్ ఎంట్రీ.. అసలు ప్లాన్ ఇదేనా?

  • July 25, 2023 / 04:14 PM IST

గత కొన్నేళ్లలో వరుస విజయాలతో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ మారింది. వరుస విజయాలు తారక్ క్రేజ్, పాపులారిటీని పెంచాయి. ఆర్.ఆర్.ఆర్ సినిమాతో ఇతర భాషల్లో సైతం పాపులారిటీని సంపాదించుకుని గ్లోబల్ స్టార్ గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలు పూర్తైన తర్వాత సోలో హీరోగా యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో భారీ సినిమాలో నటించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ బ్యానర్ లో వార్2 సినిమాలో నటిస్తున్న తారక్ తర్వాత సినిమాలు నెక్స్ట్ లెవెల్ లో ఉండేలా ప్లాన్ చేసుకున్నారని బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం రూల్ చేసే దిశగా తారక్ అడుగులు వేస్తున్నారని.

యశ్ రాజ్ ఫిల్మ్స్ లో వరుసగా సినిమాలు చేసే అవకాశం రావడం వల్లే తారక్ వార్2 సినిమాలో తన పాత్ర నిడివి తక్కువైనా నటించడానికి అంగీకరించారని సమాచారం అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ స్టార్ డమ్ ఏ రేంజ్ లో పెరిగిందో ప్రూవ్ చేయడానికి ఇంతకు మించి సాక్ష్యాలు కావాలా అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిదానమే ప్రధానం అనే సూత్రాన్ని ఫాలో అవుతూ తారక్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటున్నారు.

మల్టీస్టారర్ సినిమాలకు సైతం తారక్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. తారక్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల బడ్జెట్ 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తన భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సంబంధించి భారీ ప్లాన్స్ చేశారని సమాచారం అందుతోంది.

నవ్యత ఉన్న కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కెరీర్ పరంగా మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సొంత బ్యానర్ భాగస్వామిగా ఉన్న సినిమాలలో నటించడానికి తారక్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎన్టీఆర్ త్వరలో మరిన్ని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus