Jr NTR Watch Price: వామ్మో.. తారక్ పెట్టుకున్న వాచ్ రేటు తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తన సినీ కెరీర్ లో ఎన్నో అరుదైన ఘనతలను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. యంగ్ జనరేషన్ హీరోలను ప్రోత్సహించే విషయంలో సైతం తారక్ ముందువరసలో ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), విశ్వక్ సేన్ (Vishwak Sen) కెరీర్ పరంగా ఎదగడానికి తారక్ తన వంతు సహాయసహకారాలు అందిస్తున్నారు. అదే సమయంలో దేవర సినిమా గురించి షాకింగ్ అప్ డేట్స్ ఇస్తూ ఈ సినిమాపై ఎన్టీఆర్ అంచనాలను పెంచుతున్నారు.

టిల్లూ స్క్వేర్ (Tillu Square) ఈవెంట్ లో తారక్ పెట్టుకున్న వాచ్ ఖరీదు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. ఈ వాచ్ ఖరీదు 1,89,000 డాలర్లు కాగా ఇండియన్ కరెన్సీ ప్రకారం ఒక కోటీ 57 లక్షల 57 వేల 988 రూపాయలు కావడం గమనార్హం. జూనియర్ ఎన్టీఆర్ దగ్గర మరిన్ని ఖరీదైన వాచ్ లు ఉన్నాయని సమాచారం అందుతోంది. ఒక్కో సినిమాకు 80 నుంచి 100 కోట్ల రూపాయల రేంజ్ లో తారక్ రెమ్యునరేషన్ ఉంది.

దేవర (Devara) సినిమాను పూర్తి చేసి వార్2 సినిమాతో తారక్ బిజీ కానున్నారు. వార్2 మూవీ పూర్తైన తర్వాత దేవర2 మొదలవుతుందా? లేక తారక్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel)  మూవీ మొదలవుతుందా అనే ప్రశ్నలకు జవాబు దొరకాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్ లో భాగంగా ఫ్యాన్స్ లో నెలకొన్న అన్ని సందేహాలకు చెక్ పెట్టే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ కు దేవర సినిమాతో భారీ హిట్ దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

తారక్ సినిమాల విషయంలో సరైన ప్లానింగ్ తో ముందుకెళ్తున్నారని తెలుస్తోంది. రెమ్యునరేషన్ కంటే సరైన స్క్రిప్ట్ కే ప్రాధాన్యత ఇస్తున్న తారక్ కు టాలీవుడ్ సెలబ్రిటీలలో సైతం క్రేజ్ పెరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ లైనప్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. తారక్ కు వరుస సినిమాలతో భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 2024 సంవత్సరం ఫ్యాన్స్ కోరుకున్న విధంగా దేవర నామ సంవత్సరం అవుతుందేమో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus