Sandeep Reddy Vanga: ప్రభాస్ మూవీ బడ్జెట్ రివీల్ చేసిన సందీప్.. అదే హైలెట్ అని చెబుతూ?

భాషతో సంబంధం లేకుండా క్రేజ్ ను సొంతం చేసుకున్న అతికొద్ది మంది దర్శకులలో సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఒకరు. ఒక్కో సినిమాకు సందీప్ రెడ్డి వంగా రెండు నుంచి రెండున్నరేళ్ల సమయం తీసుకున్నా సినిమా మాత్రం అంచనాలను మించి ఉండేలా జాగ్రత్త పడతారు. ప్రభాస్ స్పిరిట్ గురించి మాట్లాడిన సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా గురించి షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ రోల్ లో ప్రభాస్ (Prabhas) ఈ సినిమాలో కనిపిస్తారని తన దగ్గర వ్యక్తి విషయంలో తప్పు జరిగితే ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని సందీప్ పేర్కొన్నారు. 60 శాతం స్క్రిప్ట్ వర్క్ పూర్తైందని మిగతా 40 శాతం స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తానని ఆయన కామెంట్లు చేశారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి స్క్రిప్ట్ వర్క్ పూర్తవుతుందని ఆయన వెల్లడించారు.

300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నామని సందీప్ చెప్పుకొచ్చారు. ప్రభాస్ ఇమేజ్ కు ఓపెనింగ్స్ కిందే 150 కోట్ల రూపాయలు వచ్చేస్తాయని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం. ప్రభాస్ సందీప్ కాంబినేషన్ ఇండస్ట్రీని షేక్ చేసే కాంబినేషన్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు. స్పిరిట్ సినిమాలో హీరో తనను ఇబ్బంది పెడితే ఏ విధంగా రియాక్ట్ అవుతాడనేది హైలెట్ గా చూపించబోతున్నామని ఆయన చెప్పుకొచ్చారు.

స్పిరిట్ (Spirit) మూవీపై తన కామెంట్లతో సందీప్ రెడ్డి వంగా అంచనాలను పెంచేశారు. 2026 సంవత్సరంలో ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. ప్రభాస్ గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. ప్రభాస్ వరుస సినిమాల్లో నటిస్తుండటం ఫ్యాన్స్ కు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus