ఓజీ, దేవర, గేమ్ ఛేంజర్.. బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమా?

  • April 9, 2024 / 09:33 PM IST

2024 సంవత్సరం ఫస్ట్ హాఫ్ లో ఆశించిన స్థాయిలో పెద్ద సినిమాలు రిలీజ్ కాకపోవడం సినీ అభిమానులను ఒకింత నిరాశకు గురి చేసింది. ఇప్పటివరకు రిలీజైన పెద్ద సినిమా గుంటూరు కారం మాత్రమే కాగా కల్కి మూవీ ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లోనే కచ్చితంగా విడుదలవుతుందో లేదో క్లారిటీ రావాల్సి ఉంది. అయితే దసరా పండుగకు అటూఇటుగా మాత్రం ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలవుతూ ఉండటం గమనార్హం.

నెల రోజుల్లో ఏకంగా ఆరు సినిమాలు రిలీజ్ అవుతుండటంతో టాలీవుడ్ సినీ అభిమానులకు పండగేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నెల 27వ తేదీన ఓజీ సినిమా రిలీజ్ కానుంది. ఓజీ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్ డేట్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఓజీ సినిమా బిజినెస్ పరంగా కూడా అదరగొడుతోందని సమాచారం అందుతోంది.

ఓజీ సినిమా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు ఉండదని క్లారిటీ వచ్చేసింది. ఓజీ విడుదలైన రెండు వారాలకు దేవర సినిమా విడుదల కానుంది. దేవర సినిమా అంతకంతకూ ఆలస్యమవుతున్నా ఈ సినిమాపై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి. దేవర విడుదలైన మూడు వారాల తర్వాత గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. టాలీవుడ్ స్టార్స్ ఒక సినిమాతో మరో సినిమా క్లాష్ కాకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారు.

తండేల్, కంగువ, వేట్టయాన్ సినిమాలు సైతం అక్టోబర్ లోనే రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది. నెల రోజులకు అటూఇటుగా ఏకంగా ఆరు సినిమాలు విడుదలైతే మాత్రం బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ఆరు సినిమాల బడ్జెట్ ఏకంగా 1200 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది. ఈ సినిమాల కలెక్షన్లు సైతం భారీ స్థాయిలో ఉండబోతున్నాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus