Jagapathi Babu: గుంటూరు కారంపై జగపతి బాబు షాకింగ్ కామెంట్స్.. అలా చెప్పడంతో?

ఈ ఏడాది విడుదలైన అత్యంత భారీ బడ్జెట్ సినిమాలలో గుంటూరు కారం (Guntur Kaaram) ఒకటి కాగా మహేష్ బాబు (Mahesh Babu)  త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి విజయం సాధించడంలో ఫెయిలైంది. గుంటూరు కారం సినిమాలో కథ, కథనం పరంగా ఉన్న కొన్ని తప్పులు ఈ సినిమాకు మైనస్ అయ్యాయి. ఈ సినిమాలో జగపతిబాబు పాత్ర సైతం ఆసక్తికరంగా లేదని కామెంట్లు వ్యక్తమయ్యాయి. ఈ సినిమా గురించి జగపతిబాబు (Jagapathi Babu)  షాకింగ్ కామెంట్స్ చేశారు.

సూపర్ స్టార్ మహేష్ తో వర్క్ చేయడం నాకు చాలా ఇష్టమని జగపతిబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబుతో కలిసి నేను పని చేశానని కానీ ఆ సినిమాను నేను ఎంజాయ్ చేయలేకపోయానని నేను నిజాయితీగా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నానని జగపతిబాబు పేర్కొన్నారు. మహేష్ సినిమాలో పాత్ర అంటే ఆ రోల్ గొప్పగా ఉండాలని నేను ఫీలవుతానని ఆయన అన్నారు.

గుంటూరు కారం మూవీలో నా రోల్ అంతా వృథా అయిపోయిందని జగపతిబాబు వెల్లడించడం గమనార్హం. గుంటూరు కారం సినిమా కోసం నేను చేయాల్సింది చేశానని కానీ గుంటూరు సినిమాలో రోల్స్ మరింత బెటర్ గా రాసుకోవాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. సినిమా స్టార్ట్ అయిన కొన్నిరోజులకే మొత్తం గందరగోళంగా మారిపోయిందని జగపతిబాబు చెప్పుకొచ్చారు.

గుంటూరు కారం సినిమా నటీనటుల విషయంలో మార్పులు చోటు చేసుకోవడం వల్లే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గుంటూరు కారం సినిమా కలెక్షన్ల విషయంలో ప్రేక్షకులను సంతృప్తిపరిచినా కథ పరంగా మాత్రం మెప్పించలేదు. తాజాగా గుంటూరు కారం బుల్లితెరపై ప్రసారం కాగా ఈ సినిమాకు ఏ రేంజ్ లో రేటింగ్ వస్తుందో చూడాలి. మహేష్ త్రివిక్రమ్ కాంబోలో మాత్రం మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus