ఫ్యామిలీతో ట్రిప్ కి వెళ్తున్న ఎన్టీఆర్.. వైరల్ అవుతున్న పిక్స్..!

రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. రాంచరణ్ – ఎన్టీఆర్ కలిసి ఇప్పటి వరకూ షూటింగ్ లో పాల్గొన్నారు. అయితే ఇటీవల కేవలం రాంచరణ్ పై మాత్రమే కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తుండడంతో జూ.ఎన్టీఆర్ కి కాస్త బ్రేక్ ఇచ్చాడట జక్కన్న. ఈ క్రమంలో తన ఫ్యామిలీతో దుబాయ్ కి వెళ్ళడానికి రెడీ అయ్యాడు తారక్.

సతీమణి లక్ష్మి ప్రణతి.. తనయుడు అభయ్ రామ్ తో కలిసి జూ.ఎన్టీఆర్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఉండగా తీసిన కొన్ని పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ కి ఇది ఫ్యామిలీ వెకేషన్ మాత్రమే కాదట..! ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి అవసరమైన కొన్ని దుస్తులను కూడా ఎన్టీఆర్ ఈ ట్రిప్ లో కొనుగోలు చేస్తాడని తెలుస్తుంది. ఇలా పర్సనల్ గానూ… ప్రొఫెషనల్ గానూ ఈ టూర్ కి వెళ్ళబోతున్నాడన్న మాట. రెగ్యులర్ గా ఎన్టీఆర్ కూడా తన షాపింగ్ దుబాయ్ లోనే చేస్తాడని టాక్. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని డీ.వి.వి దానయ్య 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సముద్ర ఖని, ప్రియమణి కీలక పత్రాలు పోషిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో చరణ్ పై ఇంట్రొడక్షన్ ఫైట్ ఓ రేంజ్లో చిత్రికరిస్తున్నాడు జక్కన్న. ఇక దుబాయ్ ట్రిప్ అయ్యాక ఎన్టీఆర్ కూడా రెగ్యులర్ షూటింగ్లో జాయినవుతాడని సమాచారం.


3

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus