కబాలి…రికార్డుల మోత మోగిస్తుంది!!!

  • May 14, 2016 / 12:19 PM IST

తమిళ తలైవార్ రాజని కాంత్ అంటే తమిళంలోనే కాకుండా ప్రపంచం అంతా ఆయనకు అభిమానులు ఉన్నారు. దాదాపుగా 65ఏళ్ల రజనికాంత్ లేట్ వయసులో కూడా ఇరగదీస్తున్నాడు. తాజాగా “కబాలి”గా వస్తున్న రజని ఫర్స్ట్ టీజర్, మరియు ఫర్స్ట్ లుక్ యూ ట్యూబ్ లో హల్‌చల్ చేస్తున్నాయి. ఒక పక్క రికార్డుల మోత మోగిస్తూనే మరో పక్క సరికొత్త రికార్డులకు శ్రీకారం చుడుతుంది. ఇక ఈ టీజర్ విడుదలైన 22 గంటల్లోనే 50 లక్షలకు పైగా హిట్లు సంపాదించి రికార్డు సృష్టించగా.. తాజాగా మరో రికార్డు నెలకొల్పింది. ఈ టీజర్ ను ఇప్పటి వరకు కోటి 71 లక్షల మంది వీక్షించారు.

టీజ‌ర్ విడుద‌లైనప్ప‌టి నుంచీ యూట్యూబ్‌లో హిట్ల‌పై హిట్లు వ‌చ్చిపడుతూ.. రికార్డుల‌ను తిర‌గ‌రాసేస్తోంది. రజని డాన్ పాత్రలో నటిస్తూ ఉండగా, ఆయనతో జోడీగా రాధిక ఆప్టే నటిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ , టీజర్ లతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కబాలి ఫస్ట్ లుక్ తోనే ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతోంది. అంతేకాకుండా ఈ రికార్డుల పరంపరలో భాగంగా బాలీవుడ్ చిత్రాల టీజర్ రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ…అత్యధిక హిట్లు వచ్చిన భార‌త సినిమా టీజర్ గా ‘క‌బాలి’ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇక ఈ దెబ్బతో బాలీవుడ్ సూపర్ స్టార్స్ అమీర్ ఖాన్ ధూమ్-3, సల్మాన్ ఖాన్ సుల్తాన్ సినిమాల టీజర్ల రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి. మరి టీజర్ కే ఇంతటి రెస్పాన్స్ వస్తే…సినిమా విడుదలయితే ప్రభంజనమే అంటున్నారు తలైవార్ అభిమానులు. మరి ఈ అంచనాలు ఎంతవరకూ రీచ్ అవుతాయో చూద్దాం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus