సూపర్ గర్ల్ మూవీ ‘ఇంద్రాణి’లో సూపర్ విలన్ ఎలక్ట్రో మ్యాన్‌గా కబీర్ దుహన్ సింగ్

Advertisement

తెలుగు తెరపై గతంలో ఎన్నడూ చూడని డిఫరెంట్ పాయింట్ ఎంచుకొని ‘ఇంద్రాణి’ మూవీ రూపొందిస్తున్నారు నూతన దర్శకుడు స్టీఫెన్. వెరోనికా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుమన్ బాబు నిర్మాణ సారథ్యంలో భారీ అడ్వెంచర్ విజువల్ వండర్‌గా ఈ మూవీ రూపొందనుంది. ఈ మూవీలో సూపర్ విలన్ ఎలక్ట్రో మ్యాన్‌గా ప్రముఖ నటుడు కబీర్ దుహన్ సింగ్‌ను ఎంపిక చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన జారీ చేశారు దర్శకనిర్మాతలు.

భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటివరకు కనిపించని అత్యంత శక్తివంతమైన సూపర్ విలన్‌గా కబీర్ దుహన్ సింగ్‌ కనిపించనున్నట్లు ప్రకటించారు దర్శకనిర్మాతలు. ఇంద్రాణి, ఎలక్ట్రోమ్యాన్ కబీర్ సింగ్ మధ్య షూట్ చేసే యాక్షన్ ఎపిసోడ్స్ డిజైనింగ్ పూర్తి చేశామని, అవి అద్భుతంగా వచ్చాయని డైరెక్టర్ స్టీఫెన్ అన్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఇస్తాయని తెలిపారు. చాలా గ్రాండ్‌గా VFX వర్క్ ఉండేలా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారట డైరెక్టర్ స్టీఫెన్. ఇటీవలే విడుదల చేసిన ఇంద్రాణి టైటిల్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఇంతవరకు ఏ సినిమాలోనూ కనిపించని యునిక్ స్టోరీలైన్‌తో రూపొందనున్న ఈ ‘ఇంద్రాణి’ బాక్సాఫీస్ రిజల్ట్ పరంగా బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని ఈ సందర్భంగా నిర్మాత స్టాన్లీ సుమన్ బాబు పేర్కొన్నారు. మొదటిసారి తమ సినిమాతో ‘ఇండియన్ సూపర్ గర్ల్స్’ని మీ ముందుకు తెస్తున్నామని దర్శకనిర్మాతలు చెప్పారు. అతిత్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటిస్తామని అన్నారు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news