పదేళ్ళ తర్వాత మాతృభాషలో సినిమా చేస్తున్న కాజల్

  • June 9, 2018 / 05:29 AM IST

ప్రస్తుత తరం అంతా పునాదులు మర్చిపోయి బ్రతుకుతున్నారు.. కానీ నేను మాత్రం నా పునాదులు మర్చిపోలేదని చెబుతోంది కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ సూపర్ స్టార్ డమ్ ఎంజాయ్ చేస్తున్న కాజల్ అగర్వాల్ నేటివ్ పంజాబీ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ పంజాబీ పాప ఇండస్ట్రీకి వచ్చి ఇటీవలే పదేళ్ళు పూర్తి చేసుకొంది. ఇన్నాళ్ల తర్వాత తన మాతృభాషలో ఓ సినిమా చేసేందుకు సన్నద్ధమవుతోంది ఈ నిండు చందమామ.

పంజాబీలో నటించబోయే సినిమా గురించి పూర్తి స్థాయి డీటెయిల్స్ ఇంకా తెలియనప్పటికీ.. సినిమా మాత్రం కన్ఫర్మ్ అని తెలుస్తోంది. ఇకపోతే.. కాజల్ ప్రస్తుతం తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఒక సినిమా, తమిళంలో “పారిస్ పారిస్” సినిమాలతోపాటు ఓ బాలీవుడ్ సినిమా కూడా సైన్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న కాజల్ అగర్వాల్ ఇప్పుడు స్టార్ హీరోలతో మాత్రమే కాకుండా నయనతార తరహాలో యంగ్ హీరోస్ తోను సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపుతుందట, అలాగే మంచి కథ రెడీ చేస్తే లేడీ ఓరియెంటెడ్ ఫిలిమ్ లోనూ నటిస్తానని చెబుతోంది ఈ చిన్నది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus