అందాల భామ కాజల్ టాలీవుడ్ లో అదుపు పెట్టిన తొలి నాళ్ళలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నా, వరుస అవకాశాలతో, భారీ హిట్స్ తో గ్ల్యామర్ క్వీన్ గా ఎదిగింది. అంతేకాకుండా అదే క్రమంలో ఈ బ్యూటీ సినిమా రంగంలోకి వచ్చి 10 ఏళ్ళు దాటిపోవడంతో అంతా ఆమె పని అయిపోయింది అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా రెండు బారీ సినిమాలు, ఇద్దరు బడా హీరోలతో ఆమెకు అవకాశం లభించడంతో సంబర పడిపోయి మరీ నటించింది కాజల్. అంతవరకూ భాగానే ఉంది కానీ, అసలు చిక్కు అక్కడే వచ్చింది.
విషయం ఏమిటంటే….సమ్మర్ రేస్ కు వచ్చినరెండు భారీ సినిమాలలో కాజల్ హీరోయిన్ గా నటించడంతో తిరిగి ఆమె హవా మొదలవుతుంది అని అనుకున్నారు అంతా. అయితే కాజల్ నటించిన రెండు భారీ సినిమాలు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ‘బ్రహ్మోత్సవం’ భారీ ఫ్లాప్ లుగా మారడంతో ఇప్పుడు కాజల్ ను అందరు మళ్ళీ ఐరన్ లెగ్ బ్యూటీగా విమర్శిస్తున్నారు. అసలే అవకాశాలు లేవు, వచ్చిన రెండు బడా ఆఫర్స్ డిజాస్టర్స్ గా నిలవడంతో కాజల్ ఫ్యూచర్ కాస్త డౌట్ గానే కనిపిస్తుంది.
ఇక ఈ రెండు సినిమాలపై ఒక మీడియా రిపోర్టర్ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’, ‘బ్రహ్మోత్సవం’ సినిమాల డిజాస్టర్లపై ఏమనిపిస్తుందని అని ఆమె ను అడగగా…కాస్త తెలివిగా తాను ఫ్లాపులను హృదయం వరకు, అలాగే సక్సెస్‌ను తల వరకు తీసుకోనని చెబుతూనే. సినిమా హిట్టా, ఫ్లాపా అనేది చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుందని అంటూ ఈ రెండు మూవీల్లో మంచి రోల్స్ చేశానని తనవరకైతే తన క్యారెక్టర్లకి మంచి పేరు వచ్చిందని కవర్ చేసింది.