కాజల్ ఏంటి..? చిరుని అవమానించడమేంటి అనుకుంటున్నారా..? చిరంజీవి 150 వ సినిమా షూటింగ్ మొదలయ్యి ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే
ఇప్పటివరకు ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని ఫైనల్ చేయలేదు. చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ పారితోషికం విషయంలో అందరూ డ్రాప్ అవుతున్నారు. ఈ నేపధ్యంలో చిరు సరసన కాజల్ అయితే బావుంటుందని ఆలోచించిన చిత్రబృందం తనను సంప్రదించారట.
కానీ కాజల్ మాట్లాడిన మాటలకు చిత్ర బృందం షాక్ అయినట్లు తెలుస్తోంది. తను సినిమాలో నటించాలంటే రెండు కోట్లు ఇవ్వాల్సిందేనని పట్టు బట్టిందట. వినాయక్ సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తుంటే.. చిరు సినిమా అయితే నాకేంటి..? నేను కూడా స్టార్ హీరోయిన్ నే కదా..? కలెక్షన్స్ బాగానే వస్తాయి కదా.. అంటూ.. చిరు సినిమాను తక్కువ చేసి మాట్లాడిందట. అసలే ఫాప్స్ లో ఉన్న కాజల్ వచ్చిన ఆఫర్ ను ఇలా దూరం చేసుకోవడం, దురుసుగా ప్రవర్తించడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.