మళ్ళీ మళ్ళీ కాజలే కావాలంటున్న విజయ్ !!

  • December 22, 2016 / 07:18 AM IST

రోజు ఐస్ క్రీమ్ తినడానికి అలవాటు పడిన కుర్రాడు “నాకు ఐస్ క్రీమ్ కావాలి” అని మారాం చేసినట్లుగా తమిళ కథానాయకుడు విజయ్ కూడా తన తాజా చిత్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కాజలే హీరోయిన్ గా కావాలి అని మారాం చేస్తున్నాడట. “బైరవ” అనంతరం “రాజా రాణి” ఫేమ్ అట్లీ దర్శకత్వంలో విజయ్ రెండోసారి నటించనున్న చిత్రంలో తొలుత నయనతారను కథానాయికగా అనుకొన్నారు. రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్ లా కాకుండా కాస్త టిపికల్ రోల్ ఉండడమే అందుకు కారణం. అయితే.. నయనతారను పట్టించుకోని విజయ్ మాత్రం కాజల్ కావాలని పట్టుబడుతున్నాడట.

ఇదివరమే “తుపాకి, జిల్లా” చిత్రాల్లో కాజల్ తో కలిసి నటించిన విజయ్ కి ఆ రెండు సినిమాలూ ఘన విజయాలు సొంతం చేసుకోవడంతోపాటు కాజల్ లో కలిసి నటించడం కంఫర్ట్ గా అనిపించిందట. అందుకే తన తాజా చిత్రంలో కాజల్ కావాలని ప్రొడ్యూసర్స్ కి చెప్పాడట. ప్రస్తుతం చిరంజీవి, అజిత్, మహేష్ బాబు సినిమాలతో యమ బిజీగా ఉన్న కాజల్ డేట్స్ కోసం ప్రొడ్యూసర్స్ నానా పాట్లు పడుతున్నారని.. అతి త్వరలోనే కాజల్ ను కన్ఫర్మ్ చేసి ప్రొజెక్ట్ ను ఎనౌన్స్ చేస్తారని తెలుస్తోంది!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus