పెళ్లికి ముందు పెళ్లి తరువాత స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పేరు మారుమ్రోగుతున్న సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న కాజల్ అగర్వాల్ ఆ ఇంటర్వ్యూల్లో కీలక విషయాలను వెల్లడిస్తున్నారు. రెండు రోజుల క్రితం కాజల్ కీలక పాత్రలో నటించిన మోసగాళ్లు సినిమా విడుదల కాగా ఆ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు కాజల్ పాత్రకు మంచి పేరు తెచ్చిపెట్టింది. పెళ్లి తరువాత కూడా కాజల్ అగర్వాల్ వరుస సినిమా ఆఫర్లతో బిజీ అవుతున్నారు. మోసగాళ్లు ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న కాజల్ అగర్వాల్ కీలక విషయాలను వెల్లడించారు.
మనుషుల్లో కొంతమందిని చూస్తే తనకు ఒళ్లు మండుతుందని కాజల్ తెలిపారు. వాళ్లను కొట్టాలని అనిపించేంత కోపం వస్తుందని.. ఎవరైనా అబద్ధాలు చెబితే తనకు ఈ విధంగా అనిపిస్తుందని కాజల్ అగర్వాల్ అన్నారు. ఎవరైనా తనతో అబద్ధాలు చెప్పాలంటే భయపడతారని ఆమె చెప్పుకొచ్చారు. అబద్ధాలు చెప్పేవాళ్లతో తాను చాలా జాగ్రత్తగా ఉంటానని కాజల్ అన్నారు. ఈ రెండు రకాల మనుషులను చూస్తే తనకు కోపం రావడంతో పాటు జాలి కూడా వేస్తుందని ఆమె తెలిపారు.
అయితే ఈ మధ్య కాలంలో తనను తాను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నానని కాజల్ వెల్లడించారు. అబద్ధం చెప్పేవాళ్లు, మోసం చేసేవాళ్లు ఎదురైనా కోపం ప్రదర్శించకుండా ఉంటున్నానని ఆమె అన్నారు. మోసగాళ్లు సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాకపోవడంతో చిత్రయూనిట్ ప్రమోషన్లలో పాల్గొంటూ సినిమా ప్రేక్షకుల్లో హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మోసగాళ్లు సినిమ కాజల్ కెరీర్ కు ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో చూడాల్సి ఉంది.
Most Recommended Video
చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!