యంగ్ హీరోయిన్లు గ్లామర్ ట్రీట్‌తో ఆడియన్స్‌కి షాక్ ఇస్తుంటే.. సీనియర్ భామలు మాత్రం వాళ్లని మించి.. ‘తగ్గేదే లే’ అనే రేంజ్లో అందాలు ఆరబోస్తూ షాక్ ఇస్తున్నారు.. మీరు జూనియర్లేనంటూ నాలుగు పదుల వయసుకి దగ్గరపడుతున్నా కానీ వలపు వయ్యారాలతో కుర్రకారుకి కిక్ ఇస్తున్నారు.. కాజల్ అగర్వాల్ పెళ్లై, ఓ బిడ్డకు తల్లైనా కానీ గ్లామర్ గ్రాము అయినా తగ్గలేదు సరికదా మరింతగా మెరిసిపోతుంది.. చెల్లెలు నిషా అగర్వాల్ అక్కకంటే ముందే షాదీ చేసుకుని, ఓ బాబుకి జన్మనిచ్చింది..
అంతటితో సినిమాలు ఆపేసింది కానీ పెళ్లి, ప్రెగ్నెంట్ అప్పుడు కొద్ది రోజులు మాత్రమే గ్యాప్ తీసుకుని రీ ఎంట్రీ ఇచ్చింది కాజల్ (Kajal) .. రీసెంట్గా ఈ సెలబ్రిటీ సిస్టర్స్ చేసిన ఫోటోషూట్ పిక్స్, వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ట్రెడిషనల్, మోడ్రన్ వేర్లో మెరిసిపోయారు.. పెళ్లి, పిల్లలు పుట్టాక కూడా అందం అణువంతైనా దగ్గలేదు.. అక్కాచెల్లెళ్లిద్దరూ అన్నం తింటున్నారా.. అందం తింటున్నారా? అంటూ యూత్ పోరగాళ్లు కామెంట్స్ చేస్తున్నారు..