నిర్మాణ రంగంలోకి రావడానికి భయపడి.. ప్రొజెక్ట్ వదిలేసింది

Advertisement

“అ!” సినిమాతో కాజల్ అగర్వాల్ ను భీభత్సంగా ఇంప్రెస్ చేసి.. ఆమెకు క్లోజ్ అయిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో ప్రశాంత్ వర్మ ఒకడు. ప్రశాంత్ వర్మ టాలెంట్ కి ఫిదా అయిన కాజల్ అగర్వాల్ తెలుగు వెర్షన్ క్వీన్ రీమేక్ అయిన “దటీజ్ మహాలక్ష్మి”కి దర్శకత్వం వహించే బాధ్యతను దగ్గరుండి మరీ ఇప్పించింది. అనంతరం మనోడి పుట్టినరోజు వేడుకలను కూడా నిర్వహించింది. అంతటితో ఆగని కాజల్ అతడి కోసం నిర్మాతగా మారడానికి కూడా వెనుకాడలేదు. “అ!”కి సీక్వెల్ ను నిర్మించడం కోసం “కె.ఎ ఫిలిమ్స్” అనే బ్యానర్ ను కూడా రిజిష్టర్ చేయించింది.

అంతా బాగానే ఉంది అనుకొంటున్న తరుణంలో ప్రశాంత్ వర్మ నెత్తి మీద పిడుగు పడేలా చేసింది కాజల్ రీసెంట్ డెసిషన్. హీరోయిన్ గా డబ్బులు పుచ్చుకోవడం తప్ప ఇచ్చుకోవడం తెలియని కాజల్ కి నిర్మాణంలోకి దిగితే కనీసం ఒక పది కోట్ల రూపాయల వరకు అయినా ఖర్చు చేయాల్సి వస్తుందని, ఆ మొత్తం తిరిగి వెనక్కి వస్తుందా లేదా అనేది అదృష్టం బట్టి ఉంటుందని తెలిసేసరికి నిర్మాణం నుండి తప్పుకొన్నట్లు తెలుస్తోంది. కాజల్ నిర్మాణం నుండి తప్పుకోవడంతో “అ!” సీక్వెల్ ఆగిపోయినట్లే. మరి ఇప్పుడు ప్రశాంత్ వర్మ నెక్స్ట్ సినిమా ఏమిటి అనే విషయంలో క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read