టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్… అక్టోబర్ 30న పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిన గౌతమ్ కిచ్లుతో కాజల్ పెళ్లి జరిగింది. కొద్దిపాటి బంధువులు, సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగానే ఈ వేడుక నిర్వహించారు కాజల్ కుటుంబ సభ్యులు. అయితే పెళ్ళికి ముందు వరకూ కాజల్ తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చింది లేదు. కాజల్ చెల్లెలు మరియు టాలీవుడ్ హీరోయిన్ అయిన నిషా అగర్వాల్ కూడా..
‘నేను కాదు అక్కే తన లవ్ స్టోరీని ఈ ప్రపంచానికి చెబుతుంది’ అంటూ దాటేసింది. ఎట్టకేలకు తాజాగా కాజల్ తన లవ్ స్టోరీని బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. “గౌతమ్ నాకు 10 ఏళ్ళ నుండే తెలుసు. అయితే 7 ఏళ్ళ నుండీ మా ఫ్రెండ్ షిప్ బలపడింది. నాకు గౌతమ్ అంటే చాలా ఇష్టం ఉన్నప్పటికీ.. బయటపడలేదు. అయితే గౌతమే మొదట… ‘పెళ్లి చేసుకుందామనే’ ప్రొపోజల్ ను నా ముందు పెట్టాడు. నాకు చాలా హ్యాపీ గా అనిపించింది.
ఆ మాట కోసమే నేను ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నాను. వెంటనే ఓకే చెప్పేసాను. ఈ ఏడాది ప్రారంభంలోనే పెళ్లి చేసుకుందామని అనుకున్నాం.కానీ అనుకోకుండా లాక్ డౌన్ రావడంతో.. లేట్ అవుతూ వచ్చింది” అంటూ చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్.