Kajal Aggarwal: మరో బాలీవుడ్ సినిమాలో కాజల్!

  • June 4, 2021 / 06:07 PM IST

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అయిన కాజల్ అగర్వాల్ ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత కూడా ఈ బ్యూటీ పలు ప్రాజెక్ట్ లతో బిజీగా గడుపుతోంది. ఇప్పటికే ఆమె చేతిలో ‘ఆచార్య’, ‘ఇండియన్ 2’ లాంటి సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు ఓ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుందని సమాచారం. తాజాగా కాజల్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అది కూడా బాలీవుడ్ సినిమా కావడం విశేషం.

గతంలో బాలీవుడ్ లో ‘సింగం’,’స్పెషల్ 26′ లాంటి సినిమాల్లో నటించిన కాజల్ చివరిగా ‘ముంబై సాగా’ సినిమాలో కనిపించింది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్ సినిమాలో కనిపించడానికి సిద్ధమవుతోంది. కొత్త దర్శకుడు తథగత సింఘ రూపొందిస్తోన్న ‘ఉమా’ అనే సినిమాలో కాజల్ ను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాను అవిషేక్ ఘోష్ నిర్మించబోతున్నారు. వెడ్డింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. నేడు ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన వచ్చింది.

ఈ సినిమా కథ తనకు ఎంతో నచ్చిందని.. టైటిల్ రోల్ లో నటించడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని కాజల్ చెప్పింది. ఇలాంటి ఛాలెంజింగ్ పాత్రల కోసమే చూస్తున్నానని.. ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని కాజల్ చెప్పుకొచ్చింది. షూటింగ్ లకు పర్మిషన్ దొరకగానే.. ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో సినిమాను పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus