టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేసి.. తను ప్రేమించిన గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకోబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన వేడుకలు మొదలయ్యాయి. కాజల్ తానా చేతికి మెహందీ పెట్టుకొని ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కొన్ని ఫోటోలలో ఆమె డాన్స్ చేస్తూ కనిపించింది. ఈ ఫోటోలపై ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. మరోపక్క పెళ్లికొడుకు గౌతమ్ కిచ్లు ఇంట్లో కూడా సంప్రదాయబద్ధంగా పెళ్లి వేడుక మొదలైంది.
కొన్ని పూజలు జరిపించి గౌతమ్ చేతికి కంకణం కట్టినట్లు తెలుస్తోంది. పూర్తిగా కుటుంబ సభ్యుల సమక్షంలో కాజల్ పెళ్లి వేడుక జరుగుతోంది. పెళ్లి తరువాత కాజల్, గౌతమ్ కలిసి ఓ ఇంట్లోకి షిఫ్ట్ అవ్వబోతున్నారు. ఆ ఇంటిని కూడా సిద్ధం చేసినట్లు కాజల్ వెల్లడించింది.