ఢిల్లీకి రాజు అయినా తల్లికి బిడ్డే అనే సామెత చెప్తుంటారు మన పెద్దవాళ్లు.. నిజమే మరి.. ఎంత సెలబ్రిటీ అయినా, లక్షలాది మంది అభిమానులున్నా కానీ.. తల్లీ, బిడ్డ అనే పేగు బంధమే వేరు.. ఇక స్టార్స్ వాళ్ల క్యూట్ కిడ్స్‌తో తీసుకుని షేర్ చేసే పిక్స్ అయితే ప్రేక్షకాభిమానులను బాగా ఆకట్టుకుంటుంటాయి.. తెలుగు ఇండస్ట్రీలో దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్గా కంటిన్యూ అయిన కాజల్ అగర్వాల్.. బిజినెెస్ మెన్ గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుని, ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
బాబు పుట్టాక కొత్త ప్రపంచలోకి అడుగు పెట్టిన ఫీలింగ్ కలుగుతుందంటూ.. పూర్తి సమయాన్ని కుటుంబంతోనే గడుపుతోంది.. తమ తొలిసంతానంకి నేల్కిత్ కిచ్లు అని నామకరణం చేశారు. పిల్లాడికి సంబంధించిన బ్యూటిఫుల్ పిక్స్ అండ్ వీడియోస్ తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ అందరికీ టచ్‌లో ఉండే కాజల్ నవంబర్ 14న చిల్డ్రన్స్ డే సందర్భంగా తమ చిన్నారికి మొదటి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మరికొన్ని లవ్లీ పిక్చర్స్ పోస్ట్ చేసింది.
మాతృత్వంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ మురిసిపోతూ ముద్దాడుతున్న ఇమేజెస్‌కి ‘హ్యాపీ ఫస్ట్ చిల్డ్రన్స్ డే మై డార్లింగ్ బోయ్.. నువ్వు చాాలా సంతోషాన్ని తీసుకొచ్చావ్’ అంటూ కామెంట్ చేసింది.. కాజల్ పోస్ట్ చేసిన ఈ ఫొటోలిప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి..