కలిసి నటించిందన్న కనికరం లేకుండా

స్టార్ హీరోల మధ్య విడుదల సమయాల్లో పోటీతత్వం ఎలా ఉంటుందో తెలియదు కానీ.. హీరోయిన్ల నడుమ సినిమా ఛాన్స్ లను లాక్కోవడంలో మాత్రం మాంచి రంజుగా ఉంటుంది రచ్చ. ఆల్రెడీ ఒక హీరోయిన్ ను సెలక్ట్ అయ్యిందని తెలిసాక కూడా కొందరు స్టార్ హీరోయిన్స్ ఆ సినిమాలో ఆమెను రీప్లేస్ చేసి తమను నటింపజేయమని తమకు తెలిసిన కాంటాక్ట్స్ ద్వారా అడుగుతూనే ఉంటారు. కొందరు మరీ కాల్స్ చేసి అడగకపోయినా ఆల్రెడీ ఒక హీరోయిన్ అది కూడా తన స్నేహితురాలే సెలక్ట్ అయ్యాక పొరపాటను ఆమెను అడిగినా కూడా మరో ఆలోచన లేకుండా వేంటనే ఒకే చెప్పేస్తుంది.

ఇప్పుడు క్రేజీ లేడీ కాజల్ చేసిన పని కూడా అదే. తమిళ సూపర్ హిట్ చిత్రం “బోగన్”ను తెలుగులో రవితేజ హీరోగా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా కేతరీన్ ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కేతరీన్ కూడా తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా అనౌన్స్ చేసి రవితేజతో పనిచేయనుండడం పట్ల సంతోషాన్ని తెలిపింది. అయితే.. ఆఖరి నిమిషంలో కేతరీన్ ను తప్పించి ఆ అవకాశం కాజల్ అగర్వాల్ అందుకొన్నట్లు సమాచారం. మరి ఈ గూడుపుఠాణీలో ఎవరి హస్తం ఉందో తెలియదు కానీ.. పాపం అసలే అవకాశాల్లేక కొట్టుమిట్టాడుతున్న కేతరీన్ ను సినిమా నుండి తప్పించడం మాత్రం జరిగిపోయింది. ఇకపోతే.. కేతరీన్-కాజల్ కలిసి “నేనే రాజు నేనే మంత్రి” సినిమాలో నటించి ఉండడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus