Simbu – Nayanthara: ఏంటిది నిజమా.. శింబు సినిమాలో నయనతార నటిస్తోందా?

శింబు – నయనతార మధ్య ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఎవరి లైఫ్‌ వాళ్లు జీవిస్తున్నారు. కాబట్టి ఆ అంశాల జోలికి వెళ్లడం లేదు. అయితే, అప్పుడెప్పుడో 20 ఏళ్ల సినిమాలో నటించి ఈ ఇద్దరూ ఇప్పుడు మళ్లీ కలసి నటిస్తున్నారు అనే వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ మధ్య సినిమాలకు గ్యాప్‌ ఇచ్చినట్లు కనిపించిన శింబు.. ఇప్పుడు ఫుల్‌ స్వింగ్‌లో కొత్త కథలు విని, ఓకే చేసి పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు.

Simbu – Nayanthara

ఈ క్రమంలో కీర్తిశ్వరన్‌ సినిమా వివరాలు బయటకు వచ్చాయి. ‘డ్యూడ్‌’ సినిమాతో ప్రేక్షకుల మన్ననలు, బాక్సాఫీసు వసూళ్లు, ఇండస్ట్రీ మెప్పులు పొందారు కీర్తిశ్వరన్‌. ఇప్పుడు తన రెండో సినిమానో లేదంటే మూడో సినిమానో శింబుతో చేయాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్‌ ఎవరు అనే చర్చ జరగ్గా.. ఆ డిస్కషన్‌లో నయనతార పేరు వినిపించింది.

నయనతార – శింబు అంటే కోలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ పెయిర్‌. ఎప్పుడో 2006లో ‘వల్లవన్‌’ అనే సినిమా చేసిన ఈ ఇద్దరూ ఆ తర్వాత 13 ఏళ్లకు ‘ఇస్పేడ్‌ రాజువుమ్‌ ఇదయ రానియుమ్‌’ అనే సినిమాలో కాసేపు కలసి కనిపించారు. మళ్లీ ఇప్పుడు ఇన్నేళ్లకు జరుగుతోంది అంటున్నారు. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందట.

ఇక శింబు సినిమాలు చూస్తే.. వెట్రిమారన్‌ డైరక్షన్‌లో ‘అరసన్‌’ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత దేశింగ్‌ పెరియసామి దర్శకత్వంలో ఒకటి, అశ్వత్‌ మరిముత్తుతో ఇంకొకటి ఉండబోతున్నాయి. ఆ తర్వాత కీర్తిశ్వరన్‌ సినిమా ఉంటుంది అని చెబుతున్నారు. శింబుకు వీలు కుదిరేలోపు జేసన్‌ సంజయ్‌ డెబ్యూ సినిమా చేయాలని కీర్తిశ్వరన్‌ అనుకుంటున్నారట.

ఈ సినిమాకు సాయి అభ్యంకర్‌ సంగీతం అందిస్తారట. శింబు, నయన్‌ ఈ సినిమాకు అయితే వారికి సాయి ఎలాంటి పాటలు ఇస్తారో చూడాలి. ఆయన ఇలాంటి పాటలకు ప్రసిద్ధి కదా.

2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus