నటనా జీవితంపై కాజల్ అభిప్రాయం

  • March 17, 2018 / 07:32 AM IST

లక్ష్మి కళ్యాణం సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన బాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ .. అనేక మంచి పాత్రలు పోషించి టాలీవుడ్ యువరాణిగా పేరుతెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ స్టార్ హీరోల సరసన నటించి విజయాలను అందుకుంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. రీసెంట్ గా ఆమె నటించిన ‘అ !’ చిత్రం కూడా ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇప్పుడు తన తొలి తెలుగు హీరో కళ్యాణ్ రామ్ సరసన మరో సారి నటించిన “ఎమ్‌.ఎల్‌.ఎ” మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన కాజల్‌ ఆసక్తికర విషయాలు చెప్పింది.

చాలామంది పర్సనల్ లైఫ్, ప్రొఫిషనల్ లైఫ్ కి సమానంగా సమయం కేటాయించాలని అంటుంటారు. మీరు కూడా అంతేనా? అని అడిగితే కాజల్ తన అభిప్రాయాన్ని ఇలా చెప్పింది. ‘‘ అలా చేయడం కుదరదు. జీవితంలో ఏదో ఒకటి సాధించాలని, ఒక స్థానానికి చేరుకోవాలనే లక్ష్యం ఉన్నప్పుడు ఎవరికైనా పనిపైనే దృష్టి ఉంటుంది. నా విషయంలోనూ అంతే. హీరోయిన్ గా అయినప్పట్నుంచి నా జీవితాన్ని తిరిగి చూసుకొంటే 90 శాతం ప్రొఫిషినల్ లైఫ్ కనిపిస్తుంది. ఆ విషయం ఓ గొప్ప సంతృప్తినిస్తోంది. సినిమా జీవితంలో ప్రతి క్షణాన్నీ ఆస్వాదించా’’ అని కాజల్‌ వెల్లడించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus