ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ ని ఏలిన ముద్దుగుమ్మ కాజోల్.. ఇప్పటికీ తన అందంతో యంగ్ హీరోయిన్లకు పోటీనిస్తోంది. ఆమె వయసు 47 సంవత్సరాలంటే ఎవరూ కూడా నమ్మలేరు. ఆ రేంజ్ లో తన మెయింటైన్ చేస్తుంటుంది. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ తో వివాహం తరువాత కూడా ఆమె సినిమాల్లో నటిస్తోంది. అయితే తాజాగా ఓ అవార్డు ఫంక్షన్ వచ్చిన ఆమె స్పెషల్ గా డిజైన్ చేయించుకున్న డ్రెస్ వేసుకొచ్చింది.
ఈ కాస్ట్యూమ్ ఆమెకి సూట్ అవ్వకపోవడంతో నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ విషయంలో కాజోల్ ప్రయోగాలు చేస్తుంటుంది. తాజాగా దుబాయ్ లో జరిగిన ఓ ఈవెంట్ కి ఆమెకి బాడీ-కాన్ డ్రెస్ వేసుకొని కార్పెట్ పై నడిచింది. ఆ డ్రెస్ తో పాటు ఆమె వేసుకున్న చెప్పులు కూడా చాలా ఎక్కువ హీల్ ఉండడంతో ఆమె నడవడానికే ఇబ్బంది పడింది. కానీ ఎలాగోలా స్టేజ్ వరకు చేరుకుంది.
ఎప్పుడూ ఎంతో అందంగా కనిపించే కాజోల్.. ఈసారి తన కాస్ట్యూమ్ తో భయపెట్టిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఆమె వేసుకున్న డ్రెస్ హాలోవీన్ కాస్ట్యూమ్ లా ఉందంటూ ట్రోల్ చేస్తున్నారు. ఓ నెటిజన్ అయితే ‘ఆమె నా బైక్ కవర్ వేసుకొచ్చిందంటూ’ విపరీతంగా ట్రోల్ చేశాడు. మరో నెటిజన్ అయితే ‘ఆ డ్రెస్ దుప్పటిలా ఉందని.. అవార్డు రాకపోతే అది కప్పుకొని పడుకోవచ్చని’ కామెంట్ చేశాడు. మరికొందరేమో.. డిజాస్టర్ కాస్ట్యూమ్ అందరూ ట్రోల్ చేస్తున్నారు.